PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-news026cff43-0208-45fc-812a-12e648a2bead-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-news026cff43-0208-45fc-812a-12e648a2bead-415x250-IndiaHerald.jpgప్రైవేట్ ఉపాద్యాయుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. కరోనా కారణంగా ఇప్పటికే చాలమంది ప్రైవేట్ ఉపాద్యాయులు తమ కొలువులు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతో మంది ఉపాద్యాయులు పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఉపాద్యాయ వృత్తికి దూరమైనందుకు చాలమంది గురువులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల పాఠశాలలు పునః ప్రారంభం అయిన తరువాత కొలువులలో ఉన్న ప్రైవేట్ ఉపాద్యాయుల పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉంది. చాలా విద్యా సంస్థలు ఉపgenaral news;letterటీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!genaral news;letterMon, 08 Feb 2021 21:28:21 GMTప్రైవేట్ ఉపాద్యాయుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. కరోనా కారణంగా ఇప్పటికే చాలమంది ప్రైవేట్ ఉపాద్యాయులు తమ కొలువులు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతో మంది ఉపాద్యాయులు పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. తమకు ఎంతో ఇష్టమైన ఉపాద్యాయ వృత్తికి దూరమైనందుకు చాలమంది గురువులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల పాఠశాలలు పునః ప్రారంభం అయిన తరువాత కొలువులలో ఉన్న ప్రైవేట్ ఉపాద్యాయుల పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉంది. చాలా విద్యా సంస్థలు ఉపాద్యాయులకు జీతాలు తక్కువగా ఇస్తూ ఉండడంతో తమ పనికి తగిన ఫలితం రావడం లేదని ఉపాద్యాయులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

 ఇది వరకు ఇచ్చే వేతనం కంటే లాక్ డౌన్ తరువాత ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపాద్యాయుల జీతాలలో భారీగా కోత విధిస్తున్నాయి. దీంతో  రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వేతన కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. సాధారణంగానే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు రెండు మూడు నెలలకోసారి వేతనాలు ఇచ్చే యాజమాన్యాలు ఇప్పుడు ఏకంగా 4 నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. యాజమాన్యాలు విద్యార్థుల నుంచి 12 నెలలకు ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు మాత్రం 10 లేదా 11 నెలల వేతనాలు మాత్రమే ఇస్తూ ఉపాద్యాయుల జీతాలను కూడా దోచేస్తున్నాయి పలు విద్యాసంస్థలకు చెందిన యాజమాన్యాలు.

ఒక్క జీతల విషయంలోనే కాక సెలవుల విషయంలో కూడా ప్రైవేట్ ఉపాద్యాయులపై చిన్న చూపు వహిస్తున్నాయి. విద్యార్థులకు సెలవులు ఇచ్చిన సమయంలో కూడా పలు విద్యా సంస్థలు ఉపాద్యాయులతో అడ్మిషన్స్ క్యాంప్ అంటూ ప్రతి ఊరు తిప్పుతూ తమకు విశ్రాంతి సెలవులు కూడా ఇవ్వడం లేదని ప్రైవేట్ ఉపాద్యాయులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు సకాలంలో వేతనాలు, సెలవులు ఇచ్చేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.


కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!

షాకిస్తున్న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>