PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/our-country-has-another-record4a124759-8bd0-4426-8c1e-a74554a54a83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/our-country-has-another-record4a124759-8bd0-4426-8c1e-a74554a54a83-415x250-IndiaHerald.jpgమన దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తయి ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలిస్తున్నారు. దేశంలో ఇప్పటికే 58లక్షలమందికి టీకా ఇచ్చారు. దీంతో ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది భారత్.దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ జోరందుకుంది. అత్యధికంగా కరోనా టీకాలను అందిస్తున్న దేశాల్లో భారత్‌ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58లక్షల మందికి కరోనా టీకా ఇచ్చారు. వీరిలో 53లక్షల 4వేల మంది వైద్యారోగ్య సిబ్బంది కాగా.our country has another record;health;india;american samoa;minister;central government;internationalమన దేశం మరో రికార్డ్..!మన దేశం మరో రికార్డ్..!our country has another record;health;india;american samoa;minister;central government;internationalMon, 08 Feb 2021 13:00:00 GMT హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తయి ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలిస్తున్నారు. దేశంలో ఇప్పటికే 58లక్షలమందికి టీకా ఇచ్చారు. దీంతో ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది భారత్.
 
దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ జోరందుకుంది. అత్యధికంగా కరోనా టీకాలను అందిస్తున్న దేశాల్లో భారత్‌ అంతర్జాతీయంగా మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58లక్షల మందికి కరోనా టీకా ఇచ్చారు. వీరిలో 53లక్షల 4వేల మంది వైద్యారోగ్య సిబ్బంది కాగా.. దాదాపు 5లక్షల మంది ఫ్రంట్‌ లైన్ వారియర్స్ అని అధికారులు తెలిపారు. దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో రెండు లక్షలకుపైగా లబ్ధిదారులు కొవిడ్ టీకాను తీసుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 6లక్షల 73వేల మందికి వ్యాక్సిన్‌ రక్షణ లభించింది.  

కొవిడ్ వ్యాక్సినేషన్‌లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, యూకే ఉన్నాయి. భారత్ మూడో స్థానంలో నిలిచింది. దేశంలో టీకా పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. కరోనాను నియంత్రించేందుకు దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను అందిస్తుండగా మరో ఏడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు.

భారత్‌ పెద్ద దేశం కావడంతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేలా పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని తెలిపారు. దేశంలోని ప్రతిఒక్కరికి టీకా అందించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదన్నారు. ఈ అంశంపై డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని హర్షవర్ధన్‌ తెలిపారు. 50 ఏళ్లకు పైబడినవారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. సక్రమంగా వ్యాక్సినేషన్ నిర్వహించడంలో తన మార్క్ కనుబరిచింది.








'ఉప్పెన' లో అతి పెద్ద ట్విస్ట్ అదే ......తెలిస్తే మైండ్ బ్లాకే....??

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>