PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel-plant-dispute1ff6bb52-f32d-44fb-a6a4-e46dbed0173c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel-plant-dispute1ff6bb52-f32d-44fb-a6a4-e46dbed0173c-415x250-IndiaHerald.jpgఈ లేఖ రాయడం పట్ల సీఎం జగన్ యొక్క లక్ష్యం ఏమిటి..?? దాని వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామమాత్రంగా ఈ లేఖతో స్పందించి చేతులు దులుపుకున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. vizag steel plant dispute;jagan;andhra pradesh;narendra modi;industries;vishakapatnam;panchayati;prime minister;chief minister;letter;central government;ycp;party;narendraజగనోరి లేఖను మోదీ ఖాతరు చేస్తాడా...?జగనోరి లేఖను మోదీ ఖాతరు చేస్తాడా...?vizag steel plant dispute;jagan;andhra pradesh;narendra modi;industries;vishakapatnam;panchayati;prime minister;chief minister;letter;central government;ycp;party;narendraMon, 08 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల వివాదాలు ఒక కొలిక్కి రాకుండానే... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య తలెత్తింది. రాష్ట్రమంతా ప్రజలు ఈ విషయం గురించే చర్చిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాలు అధికార పార్టీ ఈ అంశంపై చొరవ చూపడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భంలో... సీఎం జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై, ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాయడం సంచలనంగా మారింది.

దీంతో  దీనిపై మరో చర్చ మొదలయ్యింది. ఈ లేఖ రాయడం పట్ల సీఎం జగన్ యొక్క లక్ష్యం ఏమిటి..?? దాని వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామమాత్రంగా ఈ లేఖతో స్పందించి చేతులు దులుపుకున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు.. సీఎం జగన్ సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. సీఎం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు కాబట్టే ప్రజల కోసం ప్రధానికి లేఖ రాశారని అంటున్నారు. ఫ్యాక్టరీని కాపాడుకునే విషయంలో జగన్ రెండు అంచెల స్ట్రాటజీని అనుసరిస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు కేంద్రాన్ని రిక్వెస్టు చేసుకోవటం కాకుండా తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలని నిర్ణయించుకుందో జగన్ స్పష్టం చేయాలని జనాలు అనుకుంటున్నారు. సీఎం జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తున్నారని తెలియగానే.... జగన్ తన వాదనను గట్టిగా వినిపిస్తూ.. కేంద్రం నిర్ణయంపై తారా స్థాయిలో వ్యతిరేకత చూపుతారని అందరూ ఊహించారు. కానీ తీరా లేఖ చూశాక..కేంద్రాన్ని రిక్వెస్టు చేసుకుంటున్నట్లుగా అనిపించింది. ఇలా ఏపీ సీఎం రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వినపడుతున్న సందర్భంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఎటువంటి పస లేని ఈ లేఖపై ఆశించిన సమాధానం రాదు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


జగడ్డ : జగనోరికి వాలంటీర్లు దెబ్బేస్తారా ?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>