Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sandes8db44c52-4052-4db8-87dc-039a39b97182-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/sandes8db44c52-4052-4db8-87dc-039a39b97182-415x250-IndiaHerald.jpgవాట్సాప్ కు షాక్ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో ఓ దేశీ యాప్‌ను త్వరలోనే లాంచ్‌ చేయబోతోందట. ఈ యాప్ కు సందేశ్‌ అని కూడా పేరు పెట్టేసిందట. ప్రస్తుతం ఈ యాప్‌..sandes;business;technology;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;geum;whatsapp;chatting;central government;masterవాట్సాప్ కు భారత్ షాక్.. దేశీ యాప్ రెడీ... ఇక మీదే ఆలస్యంవాట్సాప్ కు భారత్ షాక్.. దేశీ యాప్ రెడీ... ఇక మీదే ఆలస్యంsandes;business;technology;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;geum;whatsapp;chatting;central government;masterMon, 08 Feb 2021 15:22:00 GMT

న్యూఢిల్లీ: వాట్సాప్ కు షాక్ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో ఓ దేశీ యాప్‌ను త్వరలోనే లాంచ్‌ చేయబోతోందట. ఈ యాప్ కు సందేశ్‌ అని కూడా పేరు పెట్టేసిందట. ప్రస్తుతం ఈ యాప్‌ టెస్టింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక పరీక్షల్లో భాగంగా ప్రస్తుతం ఈ యాప్ ను కేవలం అధికారుల కోసం అందుబాటులో ఉంచినట్లు సమాచారం.


      
    

వాట్సాప్‌ లాంటి యాప్‌ను ఆవిష్కరించే ప్రణాళికలను ప్రభుత్వం గత ఏడాది ధృవీకరించింది. జిమ్స్(జీఐఎంఎస్‌) అనే పేరుతో ఈ ప్రభుత్వ యాప్‌ను లాంచ్‌ చేయనుందని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. అయితే పేరు మాత్రం జిమ్స్ కాకుండా.. 'సందేశ్‌' అని మార్చారు. ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దీన్ని వాడుతున్నారట. అంతర్గత సమాచార మార్పిడి కోసం కొంతమంది ప్రభుత్వ అధికారులు సందేశ్‌ను ఉపయోగిస్తున్నారట. ఈ విషయాన్ని బిజినెస్ స్టాండర్డ్ సోమవారం ఓ నివేదిక ద్వారా వెలువరించింది. 



ఈ యాప్ లో ఓటీపీ ఆధారిత లాగిన్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్స్‌ సహా ఆధునిక చాటింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఐఓఎస్‌,ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంలు రెండింటిలోనూ వాడుకునేలా తయారు చేస్తున్నారు. ఈ యాప్ కు ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) పూర్తి స్థాయిలో బ్యాకెండ్ సపోర్ట్ అందిస్తోంది.



మరి ఈ కొత్త చాటింగ్ యాప్ పూర్తి స్థాయిలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకురానున్నారో కేంద్ర ప్రభుత్వం వెలువరించలేదు. అయితే ఇప్పటికే పబ్ జీకి పోటీగా దేశీ యాప్ ఫవ్ జీ తీసుకొచ్చింది. ఈ గేమ్ కు మంచి స్పందనే వస్తోంది. ఇక ఇప్పుడు వాట్సాప్ కు కూడా పోటీగా దేశీ యాప్ రానుండడంతో దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి.






కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>