PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections170fd21c-d7a3-4996-8eaa-66101b6123b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections170fd21c-d7a3-4996-8eaa-66101b6123b6-415x250-IndiaHerald.jpgజగన్ ముఖ్యమంత్రిగా ఇరవై నెలల పాలన పూర్తి చేశారు. మరో వైపు అదే ఇరవై నెలలు అధికార వియోగంతో చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజాదరణ బాగా తగ్గిందని చంద్రబాబు లెక్కలు కట్టి మరీ అంచనాలు వేశారు. సక్రమంగా ఎన్నికలు జరిగితే కనుక జగన్ పార్టీని జనాలు నూటికి నూరు శాతం తిరస్కరిస్తారు అని బాబు లాజిక్ గానే చెప్పేశారు. jagan-nimmagadda-elections;tara;jagan;telugu;panchayati;ycp;partyజగడ్డ : వైసీపీ...టీడీపీలకు అక్కడ‌ స్టార్ట్ అయిపోయింది...?జగడ్డ : వైసీపీ...టీడీపీలకు అక్కడ‌ స్టార్ట్ అయిపోయింది...?jagan-nimmagadda-elections;tara;jagan;telugu;panchayati;ycp;partyMon, 08 Feb 2021 10:00:00 GMTజగన్ ముఖ్యమంత్రిగా ఇరవై నెలల పాలన పూర్తి చేశారు. మరో వైపు అదే ఇరవై నెలలు అధికార వియోగంతో చంద్రబాబు ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజాదరణ బాగా తగ్గిందని చంద్రబాబు లెక్కలు కట్టి మరీ అంచనాలు వేశారు. సక్రమంగా ఎన్నికలు జరిగితే కనుక జగన్ పార్టీని జనాలు నూటికి నూరు శాతం తిరస్కరిస్తారు అని బాబు లాజిక్ గానే చెప్పేశారు.

ఇక చూసుకుంటే పంచాయతీ ఎన్నికల తొలిదశ ఈ నెల 9న జరగనుంది. ఏపీలోని మొత్తం 3,249 పంచాయతీలకు గానూ 521 ఏకగ్రీవాలు మినహాయించి  మిగిలినవాటిలో ఎన్నికలు జరగనున్నయి. నిజానికి ఎన్నిక ఏదైనా ఎన్నికే. అందునా పల్లెల్లోనే జనాలు ఎక్కువగా ఉంటారు. వారి అభిప్రాయం కచ్చితంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. పైగా ఒక్క ఓటు పొల్లుపోకుండా అంతా వచ్చి ఓటేస్తారు.

అదే విధంగా ఏ పార్టీ గెలవాలన్నా కూడా పల్లె ఓట్లే కీలకం. అటువంటి వేళ పల్లెలలో పట్టు ఎవరికి ఉంది. ఎవరి జట్టుని జనాలు ఇష్టపడుతున్నారు అన్నది కూడా తేలిపోతుంది. నిజానికి పార్టీలకు అతీతంగా  ఎన్నికలు జరుగుతున్నా కూడా ఎవరు ఏ పార్టీ మద్దతుదారులో జనాలకు కచ్చితమైన అవగాహన ఉంది. దాంతొ తాను కోరుకున్న పార్టీ మద్దతుదారులను గెలిపించడం ద్వారా కచ్చితంగా జనాలు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా కొడతారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలలో టెన్షన్ మొదలైంది. ఈ రెండు పార్టీలు కూడా తమకు తామే విజేతలుగా చెప్పుకుంటున్నా జనాల తీర్పు ఎలా ఉంటుందో అన్న కంగారు అయితే చాలానే ఉంది. 9న పోలింగ్ జరిగిన వెంటనే ఫలితాలు కూడా రావడంతో  ఇరవై నెలల జగన్ పాలన మీద జనాభిప్రాయం ఇది అని తెలిసిపోతుంది. ఈ విషయంలో ఇప్పటిదాకా వచ్చిన సర్వేల సంగతి ఎలా ఉన్నా ఇదే అసలైన జనాభిప్రాయంగా ఉంటుందని  చెప్పాల్సిందే.




బాలీవుడ్ నటి సన్నీలియోన్ పై కేసు నమోదు...!

బాబుకు బాల‌య్య బెదిరింపులా.. బ్లాక్ మెయిలింగా ?

సెటైర్‌: కేసీఆర్‌ ను సీనియర్ ఎన్టీఆర్ ఆవహించాడా..?

కాపు వేద‌న‌: క‌ంచుకోట‌లో జ‌గ‌న్‌కు కాపుల వెత‌లు ప‌ట్ట‌వా ?

పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>