MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppen-movie-updatesa89dd774-a4ac-4d11-bd21-d3928d414f6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppen-movie-updatesa89dd774-a4ac-4d11-bd21-d3928d414f6b-415x250-IndiaHerald.jpgచిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం *ఉప్పెన*.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్‌) ఈ చిత్రానికి సంగీతం సమ కూర్చారు. కన్నడ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.uppen movie updates;beauty;view;cbn;chiranjeevi;kumaar;geetha;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;tamil;kannada;director;february;husband;heroine;joseph vijay;chitramఉప్పెన సినిమాలో సుకుమార్ మరియు చిరంజీవి పాత్ర ఏమిటో తెలుసా...?ఉప్పెన సినిమాలో సుకుమార్ మరియు చిరంజీవి పాత్ర ఏమిటో తెలుసా...?uppen movie updates;beauty;view;cbn;chiranjeevi;kumaar;geetha;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;tamil;kannada;director;february;husband;heroine;joseph vijay;chitramMon, 08 Feb 2021 09:00:00 GMTచిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం *ఉప్పెన*.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్‌) ఈ చిత్రానికి సంగీతం సమ కూర్చారు. కన్నడ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు..బుచ్చి బాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోజుకో వార్తతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ కాగా.

ఇక ఈ సినిమాలోని "నీ కళ్ళు నీలి సముద్రం..."  పాట అయితే... భారీ వ్యూస్ తో ముందుకు దూసుకుపోతోంది. ఇప్పుడు మరో తాజా న్యూస్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ వార్త లో చిరు పేరు వినిపించడంతో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.... చిరు అభిప్రాయం మేరకు  “ఉప్పెన” స్క్రీన్ ప్లే విషయంలో బుచ్చి బాబుకు  సహాయ పడ్డారట ఆయన గురువు సుకుమార్. క్లైమాక్స్ లో సుకుమార్ కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అనే విషయానికి వస్తే... సినిమా క్లైమాక్స్ విన్న మెగాస్టార్ చిరంజీవి..క్లైమాక్స్ విషాదంగా ఉండడంతో మార్పులు చేస్తే బాగుంటుందని సూచించారట.

తెలుగు ప్రేక్షకులకు  విషాద ముగింపును అంగీకరించేందుకు ఇబ్బంది పడతారని ఈ సలహా ఇచ్చారట చిరు. దాంతో శిష్యుడు సినిమాలోని క్లైమాక్స్ లో కొద్ది మార్పులు చేశారట సుకుమార్. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయంపై ఎటువంటి వార్త వెలువడలేదు. మరి చూద్దాం ఈ క్లైమాక్స్ మార్పు వలన సినిమా ఫలితం ఆధారపడనుందా ...లేదా...! ఈ సినిమా ఎన్నో అంచనాలతో ఫిబ్రవరి 12 న ప్రేక్షకుల కోరిక మేరకు థియేటర్లో విడుదల కానుంది. మరి వైపు తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడంతో అటు తమిళ పరిశ్రమలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


శ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>