MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-daggubati-to-act-in-balayya-movie09d143fc-98cf-44d5-b988-288587f426af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-daggubati-to-act-in-balayya-movie09d143fc-98cf-44d5-b988-288587f426af-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా బిబి3. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీ ని మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారంbalayya movie;venkatesh;rana;balakrishna;gopichand;boyapati srinu;deva;geetha;pragya jaiswal;rana daggubati;thaman s;tollywood;cinema;sangeetha;nandamuri balakrishna;audience;daggubati venkateswara rao;heroine;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;v;yashasvi jaiswal;mass;krackబాలయ్య మూవీ కోసం భల్లాల దేవుడు ....??బాలయ్య మూవీ కోసం భల్లాల దేవుడు ....??balayya movie;venkatesh;rana;balakrishna;gopichand;boyapati srinu;deva;geetha;pragya jaiswal;rana daggubati;thaman s;tollywood;cinema;sangeetha;nandamuri balakrishna;audience;daggubati venkateswara rao;heroine;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;v;yashasvi jaiswal;mass;krackMon, 08 Feb 2021 13:58:43 GMTనందమూరి బాలకృష్ణ మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా బిబి3. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీ ని మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువనిర్మాత మిరియాల రవీందర్రెడ్డి ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై బాలయ్య ఫాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. గత ఏడాది బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ ఏంటంటే దీని తర్వాత బాలయ్య, క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఇటీవల బాలయ్య కి ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ వినిపించిన గోపీచంద్ మలినేని అది ఆయనకు ఎంతో నచ్చడంతో ప్రస్తుతం దాని స్క్రిప్టు పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారట. అతి త్వరలో స్క్రిప్ట్ పూర్తి చేసిన అనంతరం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టి దానిని పట్టాలెక్కించనున్నారని అలానే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుందని సమాచారం. కాగా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని ఆ పాత్రకు గాను భల్లాల దేవుడు రానా దగ్గుబాటి ని తీసుకునేందుకు యూనిట్ సిద్ధమైందని అంటున్నారు. అతి త్వరలో రానా ని కలిసి దర్శకుడు గోపిచంద్ కథాకథనాలు వినిపించనున్నారని అలానే ఆయన నుండి ఆమోదం కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవి పట్టాలెక్కనుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే తొలిసారిగా వెండితెరపై బాలయ్య, రానాల కాంబినేషన్ ని చూడవచ్చును....!!


హెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>