Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/doctor-fee1dd474f9-b935-4e8a-93ee-b9015bede4db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/doctor-fee1dd474f9-b935-4e8a-93ee-b9015bede4db-415x250-IndiaHerald.jpg 'వైద్యో నారాయణో హరి' అంటారు. అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అని అర్థం. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తికి ఈ విషయం తెలీదో ఏమో కానీ.. వైద్యం అందించిన డాక్టర్ చేతినే కొరికి వెళ్ళను వేరు చేశాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా..doctor fee;hari;hari music;vijay;madhya pradesh - bhopal;district;police;doctor;police station;traffic police;local language;joseph vijay;research and analysis wing;bhopalవామ్మో! సైకో.. ఫీజ్ అడిగిన డాక్టర్ వేలు కొరికి చేతిలో పెట్టాడు..వామ్మో! సైకో.. ఫీజ్ అడిగిన డాక్టర్ వేలు కొరికి చేతిలో పెట్టాడు..doctor fee;hari;hari music;vijay;madhya pradesh - bhopal;district;police;doctor;police station;traffic police;local language;joseph vijay;research and analysis wing;bhopalMon, 08 Feb 2021 14:32:00 GMT

భోపాల్: 'వైద్యో నారాయణో హరి' అంటారు. అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అని అర్థం. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తికి ఈ విషయం తెలీదో ఏమో కానీ.. వైద్యం అందించిన డాక్టర్ చేతినే కొరికి వెళ్ళను వేరు చేశాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఊహించని ఈ పరిణామంతో డాక్టర్ షాక్ అయ్యాడు. అతడి ఆర్థనాదాలతో ఆసుపత్రి దద్దరిల్లింది.




రాష్ట్రంలోని ఛింద్వాడా పరిధిలోని కుండీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. శనిచరా బజార్‌లోని డాక్టర్ ఎస్‌కే బింద్రా క్లినిక్ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి కాలిపోయిన తన చేతికి చికిత్స తీసుకునేందుకు బింద్రా క్లీనిక్‌కు వచ్చాడు. అతని వెంట మరో ఇద్దరు కూడా ఉన్నారు. డాక్టర్ బింద్రా, అతని సిబ్బంది ఆ వ్యక్తికి చికిత్స చేశారు. దీని తరువాత డాక్టర్ బింద్రా ఆ తన ఫీజు అడిగాడు. ఈ మాట విన్న పేషేంట్ పాటు అతనితో వచ్చిన వారు క్లీనిక్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. 




డాక్టర్ బింద్రా అడ్డుకోగా పేషేంట్ తో పాటు వచ్చిన విజయ్ తివారీ అనే వ్యక్తి డాక్టర్ చేతి వేలిని తన నోటిలో పెట్టుకుని గట్టిగా కొరికివేసి, చేతి నుంచి ఆ వేలిని వేరు చేశాడు. తరువాత వారు క్లీనిక్‌లోని ఫర్నీచర్‌ను, వాటర్ కూలర్‌ను ధ్వంసం చేసి, డాక్టర్ ను కొట్టి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో డాక్టర్ బింద్రా నిర్ఘాంతపోయాడు. వెంటనే తన తెగిపోయిన వేలిని తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



ఇదిలా ఉంటే ఈ విషయం తెలుసుకున్నవారంతా డాక్టర్ పరిస్థితి చూసి 'అయ్యో పాపం' అని అంటున్నారు. ఘటన క్లీనిక్‌లోని సీసీటీవీలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.





అమ్మ: గర్భిణీలు బేరిపండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా..!?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>