PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-shanthib07d554a-952a-44b5-a08e-582587d1e9e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijaya-shanthib07d554a-952a-44b5-a08e-582587d1e9e0-415x250-IndiaHerald.jpgటీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ శాంతి సెటైర్లు వేశారు. కేసీఆర్ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా పదేళ్ల పాటు తానే ముక్యమంత్రి గా ఉంటానని..ఇదివరకే అసెంబ్లీ సాక్షిగా చెప్పానని మళ్ళీ ఏది పడితే అది మాట్లాడుతున్నారని హెచ్చరించారు. తన ఆరోగ్యం బాగుందని అన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై స్పందించినప్పటికిvijayashanthi;kcr;vijayashanti;pragathi;ramu;surya sivakumar;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;chief minister;assembly;house;party;mantraకేసీఆర్ వ్యాఖ్యలపై రాములమ్మ సెటైర్లు..పదేళ్లు ఫామ్ హౌస్ ల కనిపిస్తడో..ప్రగతి భవన్లో కనిపిస్తాడోకేసీఆర్ వ్యాఖ్యలపై రాములమ్మ సెటైర్లు..పదేళ్లు ఫామ్ హౌస్ ల కనిపిస్తడో..ప్రగతి భవన్లో కనిపిస్తాడోvijayashanthi;kcr;vijayashanti;pragathi;ramu;surya sivakumar;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;chief minister;assembly;house;party;mantraMon, 08 Feb 2021 21:00:07 GMTటీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ శాంతి సెటైర్లు వేశారు. కేసీఆర్ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా పదేళ్ల పాటు తానే ముక్యమంత్రి గా ఉంటానని..ఇదివరకే అసెంబ్లీ సాక్షిగా చెప్పానని మళ్ళీ ఏది పడితే అది మాట్లాడుతున్నారని హెచ్చరించారు. తన ఆరోగ్యం బాగుందని అన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై స్పందించినప్పటికి ముఖ్యంగా సీఎం మార్పు పైనే మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు అనిపించింది. ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై రాములమ్మ విజయశాంతి సెటైర్లు వేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. కేసీఆర్ ఆరోగ్యం బాగుంది అది సంతోషమే కానీ తెలంగాణా ఆరోగ్యమే భాగలేదని చెపుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పోస్ట్ లో విజయశాంతి "ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం. వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైంది.

ఈ అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయి. అయితే, సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ.... ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, మబ్బుల మాటున ఉండే వానా కాలపు సూర్యుడిలా.... మరో పదేళ్ళ పాటు ఎప్పుడు ప్రగతి భవన్‌లో కనిపిస్తాడో... ఎప్పుడు ఫాం హౌస్‌లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంతో జనం తననే భరించాలని హెచ్చరిస్తున్నట్టుంది. పదేళ్ళ వరకూ ఎందుకు... కేసీఆర్ 'కారు'మబ్బుల్ని తెలంగాణ ప్రజల మరో మూడేళ్ళలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి." అంటూ విజయ శాంతి పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ చేరిన తరవాత తరచూ అధికార పార్టీపై తనదైన స్టైల్ లో స్పందిస్తున్నారు.


భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>