PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntr-kcr-ponname65e58de-23f5-496d-b297-72cc508e21fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntr-kcr-ponname65e58de-23f5-496d-b297-72cc508e21fd-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ... దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేసీఆర్ కు ఎన్టిఆర్ ఆవహించాడన్నారు. గతంలో నా చెప్పులు నిలబెట్టినా గెలుస్తారు అన్న ఎన్టీఆర్ కు ఏమి జరిగిందో చరిత్ర చెపుతోందంటూ పొన్నం కాంట్రవర్శీ కామెంట్లు చేశారు.ntr kcr ponnam;ntr;kcr;prabhakar;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;hosta;congress;mp;రాజీనామా;chintamaneni prabhakar;chief minister;history;ponnam prabhakar;governor;central government;nandamuri taraka rama rao;ponnam prabhakar goud;parakala prabhakar;partyఎన్టీఆర్ ను ఎంత మాటన్నాడు!ఎన్టీఆర్ ను ఎంత మాటన్నాడు!ntr kcr ponnam;ntr;kcr;prabhakar;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;hosta;congress;mp;రాజీనామా;chintamaneni prabhakar;chief minister;history;ponnam prabhakar;governor;central government;nandamuri taraka rama rao;ponnam prabhakar goud;parakala prabhakar;partyMon, 08 Feb 2021 09:00:34 GMTతెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీ.. వలసలను ప్రోత్సహిస్తోంది. పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు హస్తం నేతలు. ఇటీవల జరిగిన పరిణామాలతో కలవరపడుతున్న అధికార టీఆర్ఎస్ కూడా.. మళ్లీ గాడిలో పడేందుకు ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హాట్ కామెంట్స్ చేస్తూ కాక రేపుతున్నారు రాజకీయ నేతలు.

              తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ... దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేసీఆర్ కు ఎన్టిఆర్  ఆవహించాడన్నారు. గతంలో నా చెప్పులు నిలబెట్టినా గెలుస్తారు అన్న ఎన్టీఆర్ కు ఏమి జరిగిందో చరిత్ర చెపుతోందంటూ పొన్నం కాంట్రవర్శీ కామెంట్లు చేశారు.  సిఎం పదవి ఎడమ కాలు చెప్పు తో సమానం అన్న  కేసిఆర్ మాట ప్రజాస్వామ్యనికే అవమానమని మండిపడ్డారు.
ఓటు వేసిన ప్రజలకు క్షమాపణ చెప్పి  ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.  గవర్నర్ వెంటనే  జోక్యం చేసుకొని సిఎం పై చర్య తీసుకోవాలని కోరారు టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్.

                 ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో హాట్ కామెంట్ చేశారు  కేసీఆర్. ముఖ్యమంత్రి మారుతున్నారంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆయన ఓ రేంజ్ లో స్పందించారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలు చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నారని తెలుస్తోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం కాకూడదనే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని.. ఇప్పుడు అందరితో మాట పడాల్సి వచ్చిందంటూ.. పార్టీ నేతలపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.




శ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>