PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marwadis380d5cb3-e78f-4f8a-a197-d0cfaa9385a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/marwadis380d5cb3-e78f-4f8a-a197-d0cfaa9385a7-415x250-IndiaHerald.jpgమార్వాడీలు.. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కనిపిస్తారు.. ప్రత్యేకంగా వ్యాపార వర్గాల్లో వీరు ఎక్కువ. అయితే.. మార్వాడీలు ఆంధ్ర, తెలంగాణ స్ధానిక వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని.. బహుజన కులాల రిజర్వేషన్ లు, లోన్లు, రేషన్, ఆరోగ్య శ్రీ, ఉచిత ఇండ్లు, ఫీజు రియంబర్స్, స్కాలర్‌షిప్ లు.. ఇలా స్థానికులకు దక్కాల్సిన అన్నిరకాల వసతులు కొల్లగొడుతున్నారని ఇటీవల కొందరు వాదిస్తున్నారు. ఉత్తర భారత మార్వాడీలు, ఓసీ కులాల పారిశ్రామిక వేత్తలు మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చి సబ్సీడీ కింద తక్కువ ఖరmarwadis;vidya;yajamanya;telangana;backward classes;press;local languageషాకింగ్ : మార్వాడీలు మన తెలుగోళ్లను దోచుకుంటున్నారా..?షాకింగ్ : మార్వాడీలు మన తెలుగోళ్లను దోచుకుంటున్నారా..?marwadis;vidya;yajamanya;telangana;backward classes;press;local languageMon, 08 Feb 2021 09:00:00 GMTతెలంగాణ స్ధానిక వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని.. బహుజన కులాల రిజర్వేషన్ లు, లోన్లు, రేషన్, ఆరోగ్య శ్రీ, ఉచిత ఇండ్లు, ఫీజు రియంబర్స్, స్కాలర్‌షిప్ లు.. ఇలా స్థానికులకు దక్కాల్సిన అన్నిరకాల వసతులు కొల్లగొడుతున్నారని ఇటీవల కొందరు వాదిస్తున్నారు. ఉత్తర భారత మార్వాడీలు, ఓసీ కులాల పారిశ్రామిక వేత్తలు మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారులకు లంచాలిచ్చి సబ్సీడీ కింద తక్కువ ఖరీదుతో భూములు తీసుకోని కంపెనీలు ప్రారంభిస్తారని చెబుతున్నారు.

మార్వాడీ కంపెనీలలో ఉద్యోగులుగా వారి కులాలవారినే ఉత్తర భారత దేశం నుండి తెచ్చుకుంటారని...  స్ధానిక దుకాణాలలో కనీసం ఉప్పు-పప్పు కూడా కొనరని.. టీ నుండి దినసరి అన్ని అవసరాలకు వారి కులస్తుల తోనే దుకాణాలు పెట్టిస్తారన్న వాదన ఉంది. ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వారికులస్తులకు ఉద్యోగాలు ఇచ్చి ఉండటానికి ఇల్లు, పిల్లలకు విద్య, వైద్యం కల్పించాల్సిన బాధ్యత కంపెనీలదేనని చెబుతున్నారు. మార్వాడీ కులస్తులకు అన్ని వసతులు కల్పించడం కంపెనీలకు కోట్లల్లో ఆర్ధిక బారం అవుతుంది. కనుక, తమ ఉద్యోగులందరిని  బిసి కులాల జాబితాలో చేర్చే కుట్ర జరుగుతోందట.

తమ కంపెనీల ఉద్యోగుల తరపున మార్వాడీ యాజమాన్యం డబ్బు సంచులతో బిసి కమీషన్ అధికారులకు కళ్లుతిరిగేలా 5 నుండి 10 లక్షలు ఇచ్చి తమ కులాన్ని bc జాబితాలో చేరుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బిసీ అధికారుల సలహాతో మార్వాడీలకు  స్ధానిక bc సంఘాల అధినేత లకు కూడా ఒక 10 లక్షలు ముట్టజెపుతున్నారట. వెంటనే బిసి నేతలు ఒక ప్రెస్ మీట్, ఇందిరాపార్కు దగ్గర ధర్నా, బిసి అధికారులకు మెమోరాండం ఇచ్చి ఫలానా కులాన్ని బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తారని విమర్శిస్తున్నారు.

ఈ మార్వాడీల దోపిడీపై స్ధానిక మేధావులు ఆలోచించాలని.. స్ధానిక వ్యాపారాలను కాపాడండాలని కొందరు పిలుపు ఇస్తున్నారు. మార్వాడీ వ్యాపారాలు హఠావో - బహుజన కులాల రిజర్వేషన్లు బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై లోతైన విశ్లేషణ చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది.




శ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>