Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi-gopichand08f46bdb-752e-4177-8f46-87b7279b47bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi-gopichand08f46bdb-752e-4177-8f46-87b7279b47bc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మారుతి 2019 చివర్లో ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్, రాశి ఖన్నా జోడీగా నటించారు. సినిమాలో రాశి ఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత మారుతి మళ్లీ ఆమెను రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. maruthi-gopichand;gopichand;maruti;raashi khanna;raasi;sampath;sampath nandi;tollywood;2019;cinema;jil;remake;hero;heroine;success;oxygen;rashi khanna;massమారుతి సినిమాలో గోపీచంద్ రొమాన్స్ చేసేది ఎవరంటే..?మారుతి సినిమాలో గోపీచంద్ రొమాన్స్ చేసేది ఎవరంటే..?maruthi-gopichand;gopichand;maruti;raashi khanna;raasi;sampath;sampath nandi;tollywood;2019;cinema;jil;remake;hero;heroine;success;oxygen;rashi khanna;massMon, 08 Feb 2021 22:23:54 GMTటాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మారుతి 2019 చివర్లో ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్, రాశి ఖన్నా జోడీగా నటించారు. సినిమాలో రాశి ఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత మారుతి మళ్లీ ఆమెను రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మాస్ హీరో గోపీచంద్ కూడా కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేక వెనకపడ్డాడు. అందుకే మారుతి సినిమాతో ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. మారుతి, గోపీచంద్ మొదటి సారి కలిసి చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నాని కన్ ఫాం చేశారట. అయితే గోపీచంద్ తో ఆల్రెడీ జిల్, ఆక్సిజన్ సినిమాలో జత కట్టారు. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మారుతి మాత్రం తన హిట్ సెంటిమెంట్ కారణంగా రాశి ఖన్నాని ఫిక్స్ చేశారు.

మిగతా సినిమాలు ఎలా ఉన్నా మారుతి సినిమా కాబట్టి తన మార్క్ ఉండాల్సిందే. ఈ సినిమాను జాలీ ఎల్.ఎల్.బి 2కి రీమేక్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి మాత్రం గోపీచంద్ కు పక్కా హిట్ అందించడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. మరి లాయర్ గోపీచంద్ తో మారుతి మార్క్ ఎలా చూపిస్తాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.        




ఇంత పిరికితనం ఎందుకు..? వార్న్ షాకింగ్ కామెంట్స్

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>