PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi3aa3c6c4-9996-4c1b-8aab-ccb58f49056a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi3aa3c6c4-9996-4c1b-8aab-ccb58f49056a-415x250-IndiaHerald.jpgసాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన దేశ ఎల్లలు దాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కెనడా ప్రధానమంత్రితో పాటు.. ప్రపంచ పర్యావరణ వేత్త గ్రెటా తన్‌బర్గ్‌, సింగర్ రిహన్నా వంటి వారు సైతం రైతులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారత రైతుల పోరాటంపై పెట్టిన సోషల్ మీడియా పోస్టు.. దానిపై ఢిల్లీ పోలీసుల ఓవరాక్షన్ ప్రపంచం ముందు భారత పరువు తీసిన సంగతి తెలిసిందే. రైతుల పోరాటంపై ఆమె పెట్టిన పోస్టును సరిచూసుకోవాల్సింది పోయి.. ఏకంగా ఆమెపై ఎఫ్‌ ఐఆర్ నమోదు చేయడం ఎదురు దెబ్బ తీసిందిmodi;modi;mamata benerjee;mamatha;delhi;bharatiya janata party;india;canada;west bengal - kolkata;narendra modi;police;media;prime minister;assembly;international;mamta mohandas;narendraభారత్‌ పై ప్రపంచ శక్తుల కుట్ర..? రహస్యం బయటపెట్టిన మోడీ..!?భారత్‌ పై ప్రపంచ శక్తుల కుట్ర..? రహస్యం బయటపెట్టిన మోడీ..!?modi;modi;mamata benerjee;mamatha;delhi;bharatiya janata party;india;canada;west bengal - kolkata;narendra modi;police;media;prime minister;assembly;international;mamta mohandas;narendraMon, 08 Feb 2021 00:00:00 GMTకెనడా ప్రధానమంత్రితో పాటు.. ప్రపంచ పర్యావరణ వేత్త గ్రెటా తన్‌బర్గ్‌, సింగర్ రిహన్నా వంటి వారు సైతం రైతులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. భారత రైతుల పోరాటంపై పెట్టిన సోషల్ మీడియా పోస్టు.. దానిపై ఢిల్లీ పోలీసుల ఓవరాక్షన్ ప్రపంచం ముందు భారత పరువు తీసిన సంగతి తెలిసిందే.  రైతుల పోరాటంపై ఆమె పెట్టిన పోస్టును సరిచూసుకోవాల్సింది పోయి.. ఏకంగా ఆమెపై ఎఫ్‌ ఐఆర్ నమోదు చేయడం ఎదురు దెబ్బ తీసింది.

అంతే కాదు.. ఇప్పుడు బీజేపీ కూడా అంతర్జాతీయ సెలబ్రెటీలపై విరుచుకుపడటం  మొత్తం మీద ఇండియా పరువు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా  పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ చేసిన పోస్టులో ప్రస్తావించిన టూల్‌ కిట్‌పై దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. భారత్‌పై ప్రపంచ శక్తులు కుట్రపన్నాయంటున్నారు ప్రధాని మోడీ. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విమర్శలు చేశారు.

దేశ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ప్రపంచశక్తులు కొన్ని కొద్ది రోజులుగా కుట్రలు చేస్తున్నాయన్నారు మోడీ.. ఈ కుట్రలను దేశప్రజలతో కలిసి సమర్థంగా తిప్పికొడతామని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. అంతే కాదు.. ఈ కుట్రలపై దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉంటున్న మమతాబెనర్జీ సహా ఇతర నేతలు నోరు మెదపడం లేదని విమర్శించారు. అసలు ఇలాంటి వారి తీరు చూస్తే. వారు ఆ కుట్రలను సమర్థిస్తున్నారనే అనుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోడీ ఘాటుగా విమర్శించారు.

అసలే బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా.. అందుకే ప్రధాని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శల డోసు మరికాస్త పెంచారు. బెంగాల్ ప్రజలు మమత నుంచి మమతను కోరుకుంటే ఆమె మాత్రం క్రూరత్వాన్నే వారికి చూపారని  కామెంట్ చేశారు. అభివృద్ధికి అడ్డు తగిలి బెంగాల్  యువత భవిష్యత్‌ను నాశనం చేశారని చివరకు భారత్‌ మాతాకీ జై అనే నినాదం కూడా మమతకు నచ్చకుండా పోయిందని మోదీ కామెంట్ చేశారు.




ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>