Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vyadi-nirodaka-shakthi0b458cc1-0314-4084-a3ce-2c077c3cee02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vyadi-nirodaka-shakthi0b458cc1-0314-4084-a3ce-2c077c3cee02-415x250-IndiaHerald.jpgమారుతున్న కాలానుగుణంగా మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ తీసుకునే ఆహారంతో పాటు అదనంగా గా మన ఆహారంలో లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఆహారంలో పండ్లను తీసుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా నిమ్మజాతికి చెందిన నారింజ బత్తాయి వంటి పళ్ళు తీసుకోవడం చాలా ఉత్తమం. vyadi nirodaka shakthi;apple;vitamin c;iron;vitamin;heart;sugar;pomegranate;shaktiమన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మార్గాలు....మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మార్గాలు....vyadi nirodaka shakthi;apple;vitamin c;iron;vitamin;heart;sugar;pomegranate;shaktiSun, 07 Feb 2021 06:00:00 GMTశక్తి పెరిగి భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా నిమ్మజాతికి చెందిన నారింజ బత్తాయి వంటి పళ్ళు తీసుకోవడం చాలా ఉత్తమం.

 బత్తాయి,నారింజ: వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్‌ సి, కాల్షియం విరివిగా లభిస్తాయి.వివిధ రకాల సీజనల్‌ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలను సైతం ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు కీలక పాత్ర వహిస్తుంది. ఈ పండును జ్యూస్ రూపంలో కాకుండా పండ్ల రూపంలోనే తీసుకోవడం ఉత్తమం.
 కివి: ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కివీ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది.100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. నారింజ , బత్తాయి కంటే అధిక మొత్తంలో సి-విటమిన్ ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కావున రోజువారి ఆహారంలో కివి పండును కూడా తీసుకోవచ్చు.
జామకాయ: జామకాయ లో కూడా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. జామకాయ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లను  తగ్గించే గుణం ఇందులో ఉంది.  పచ్చి జామకాయ ను ప్రతి రోజూ తింటే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

దానిమ్మ: ఈ పళ్లలో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను సరఫరా చేయడం ద్వారా, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.ఇందులో ఐరన్, జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఇది కళ్లు, చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచడానికి దానిమ్మ సహకరిస్తుంది.

ఆపిల్: రోజుకు ఒక ఆపిల్ తినడం మన శరీరానికి చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఆపిల్ పండు లో పీచుపదార్థం, విటమిన్‌ సి, విటమిన్‌ కె ఎక్కువగా ఉంటాయి.ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం తో పాటు శరీరంలో మలినాలను తొలగించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

 ప్రతిరోజు పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభించడంతో పాటు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది.


సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా.. !

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>