Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tulasie2f12e34-63e3-49f9-8a5a-f73a7b38300c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tulasie2f12e34-63e3-49f9-8a5a-f73a7b38300c-415x250-IndiaHerald.jpgతులసి చెట్టును పూజించడం భారతీయుల సంప్రదాయం. ప్రతి ఒక్కరి ఇంటి ముందర తులసి కోటను పెట్టుకుంటారు. ఈ తులసి చెట్టుకు ప్రతిరోజు పూజలు చేస్తుంటాం.తులసి లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... tulasi;thulasi;tulasi;onion;aqua;cholesterolతులసిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు, దాగి ఉన్నాయో మీకు తెలుసా...?తులసిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు, దాగి ఉన్నాయో మీకు తెలుసా...?tulasi;thulasi;tulasi;onion;aqua;cholesterolSun, 07 Feb 2021 07:00:00 GMTతులసి చెట్టును పూజించడం భారతీయుల సంప్రదాయం. ప్రతి ఒక్కరి ఇంటి ముందర తులసి కోటను పెట్టుకుంటారు. ఈ తులసి చెట్టుకు ప్రతిరోజు పూజలు చేస్తుంటాం.తులసి లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఆకలి మందగించిన వాళ్లు తులసి ఆకుల రసం, తమలపాకు రసం,పంచదార మూడింటిని కలిపి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా తులసి కషాయాన్ని తాగడం వల్ల కాలేయానికి సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయి.

విరేచనాలు,రక్త విరేచనాలు ఆగిపోవడానికి తులసి రసం, అల్లం రసం, ఉల్లిపాయ రసం,తేనె అన్నింటినీ కలిపి తాగితే రక్త విరేచనాలు, విరేచనాలు తగ్గుతాయి.

 తులసి రసమును తేనెతో కలిపి ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల నోటి పూత, గొంతు నొప్పి, బొంగురుపోయిన గొంతు తగ్గుతాయి.

 జలుబు, దగ్గు తో బాధపడుతున్న వాళ్లు తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శ్లేష్మ, కఫ వాత ములను కూడా హరిస్తుంది.

 తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే శరీరంలోని కొవ్వును నివారించి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.

 తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.అంతేకాకుండా తులసి ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల వాంతులు తగ్గిపోతాయి.

 జ్వరంతో బాధ పడుతున్న వాళ్ళు తులసి ఆకులు, పుదీనా ఆకులను కలిపి కషాయంగా చేసి రోజు తాగుతుంటే జ్వరం తగ్గుతుంది.

 గొంతు నొప్పి బాధిస్తుంటే తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.చల్లారిన తర్వాత ఆ నీటితో నోట్లో పోసుకొని పుక్కలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

 కొన్ని తులసి ఆకులను తీసుకొని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీటితో ఉదయాన్నే పళ్ళు తోముకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా, నోటిలో పొక్కులు కూడా తగ్గుతాయి.

 తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజు రాత్రి పడుకోబోయేముందు రెండు స్పూన్ల మోతాదులో తాగడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది.


లేడీ గెటప్లో బుల్లెట్ భాస్కర్.. చూస్తే పగలబడి నవ్వుతారు..?

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>