PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల వ్యవహారం కాస్త సంచలనం అయింది. కొంత మంది మంత్రులు పరిధి దాటి వ్యాఖ్యలు చేయడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తుందనే చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇప్పుడు మంత్రుల మాటలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయనే మాట వాస్తవం. వాస్తవానికి ఎన్నికల సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల సంఘం అధికారులు విషయంలో సన్నిహితంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా చేసుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం ysrcp;kumaar;bhavana;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;chief minister;minister;reddy;party;mantraనిమ్మగడ్డపై కోర్ట్ కి వెళ్ళినా... వైసీపీకే నష్టమా...?నిమ్మగడ్డపై కోర్ట్ కి వెళ్ళినా... వైసీపీకే నష్టమా...?ysrcp;kumaar;bhavana;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;chief minister;minister;reddy;party;mantraSun, 07 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల వ్యవహారం కాస్త సంచలనం అయింది. కొంత మంది మంత్రులు పరిధి దాటి వ్యాఖ్యలు చేయడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తుందనే చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇప్పుడు మంత్రుల మాటలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయనే మాట వాస్తవం. వాస్తవానికి ఎన్నికల సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల సంఘం అధికారులు విషయంలో సన్నిహితంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా చేసుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఏకగ్రీవాల విషయం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాస్త నోరు పారేసుకున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో వారు మరింత కఠినంగా ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో  వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ఎన్నికల కమిషనర్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి దానిని  కోర్ట్ లు కూడా తప్పు పట్టే అవకాశాలు ఉండవు. ఒక వేల కోర్ట్ లు ఈ విషయాన్ని పరిశీలిస్తే జరుగుతున్న వాస్తవాలను కూడా కోర్ట్ ల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

రాజ్యాంగ వ్యవస్థ పై దాడి చేస్తున్నారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి బలంగా తీసుకుని వెళ్లగలిగితే అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి, కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడక పోతే మాత్రం నష్టపోయేది వైసీపీనే అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. కాబట్టి మంత్రులను జగన్ కట్టడి చేయకపోతే మాత్రం జగన్ నష్టపోవడం కంటే కూడా పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మరి భవిష్యత్తులో జగన్ ఎం చేస్తారో చూడాలి.


నేటి బంగారం ,వెండి ధరలు ఇలా..!

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>