PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greesham-53-years-purse6e99d26b-4c03-4d5e-8049-bf2c053a5455-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greesham-53-years-purse6e99d26b-4c03-4d5e-8049-bf2c053a5455-415x250-IndiaHerald.jpg మెక్ కీ, డెకాటో, లిండ్ బర్గ్ లు గ్రీషమ్ ఆచూకీ కోసం ఎంతో శ్రమించారు.ఎన్నెన్నో గ్రూపులను ఆరా తీశారు. చివరగా నౌకాదళ వాతావరణ సేవల సంఘాన్ని సంప్రందించారు అడిగారు. అక్కడే వారికి గ్రీషమ్ చిరునామా దొరికింది. అలా పర్సును 53 ఏండ్ల తర్వాత గ్రీషమ్ కు చేరింది.greesham 53 years purse;chiranjeevi;tiru;american samoa;california;air;october;letter;sara shrawan;stephen hawkingసూపర్ వండర్ అంటే ఇదీ! 53 ఏండ్ల క్రితం పోయిన పర్సు దొరికిందిసూపర్ వండర్ అంటే ఇదీ! 53 ఏండ్ల క్రితం పోయిన పర్సు దొరికిందిgreesham 53 years purse;chiranjeevi;tiru;american samoa;california;air;october;letter;sara shrawan;stephen hawkingSun, 07 Feb 2021 13:20:21 GMT
    అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియేగోకు చెందిన పాల్ గ్రీషమ్  అమెరికా నౌకా దళంలో వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు.ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. అయితే
డ్యూటీలో భాగంగా 1967 అక్టోబర్ లో ఆయన అంటార్కిటికాకు వెళ్లారు. 13 నెలల అక్కడే ఉన్నారు. విధుల్లో ఉండగా  ఆయన పర్సు ఎక్కడో పోయింది. అందులో ఆయన ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, నేవీ గుర్తింపు పత్రం, ఆయన ముద్దుగా ‘ద ఐస్’ అని పిలుచుకునే ఎన్నెన్నో ప్రశంసా పత్రాలు అందులో ఉన్నాయి. అణు, జీవ, రసాయన దాడులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల రిఫరెన్స్ కార్డు, బీర్ రేషన్ కార్డు, పన్ను పత్రాలు కూడా ఆ పర్సులోనే ఉన్నాయి. అందుకే పర్సు కోసం ఆయనా చాలా వెతికారు. అయినా పర్సు దొరకలేదు. అంటార్కిటాకాలో తన పని అయిపోయాక ఇంటికి తిరుగు పయనమయ్యే సమయంలోనూ పర్సు కోసం గాలించినా లాభం లేకపోయింది. దీంతో ఆయన అమెరికాకు తిరిగొచ్చేశారు.  
         
            అయితే  53 ఏండ్ల  క్రితం మాయమైన పర్సు ఇప్పుడు  గ్రీషమ్ కు దొరికింది. 2014లో అంటార్కిటికాలోని రాస్ ఐల్యాండ్ లో ఉన్న మెక్ ముర్డో స్టేషన్ ను కూల్చివేశారు. అప్పుడు దొరికింది గ్రీషమ్ పోగొట్టుకున్న పర్సు. దానితో పాటు మరో వ్యక్తికి చెందిన ఓ బిల్ ఫోల్డ్ (ఫైల్) కూడా దొరికింది. ఇండియానాలోని స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బ్రూస్ మెక్ కీతో కలిసి స్టీఫెన్ డెకాటో, ఆయన కూతురు సారా లిండ్ బర్గ్ లు ఎంతో శ్రమించి గ్రీషమ్ చిరునామాను సంపాదించగలిగారు. ఆ పర్సును పోస్టు ద్వారా పంపించారు.  


           మెక్ కీ, డెకాటో, లిండ్ బర్గ్ లు గ్రీషమ్ ఆచూకీ కోసం ఎంతో శ్రమించారు.ఎన్నెన్నో గ్రూపులను ఆరా తీశారు. చివరగా నౌకాదళ వాతావరణ సేవల సంఘాన్ని సంప్రందించారు అడిగారు. అక్కడే వారికి గ్రీషమ్ చిరునామా దొరికింది. అలా పర్సు 53 ఏండ్ల తర్వాత గ్రీషమ్ కు చేరింది.పర్సును చూసి షాక్ గురైన ఆ పెద్ద మనిషి.. తన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు. 




నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము

సాక్షి సీన్ రివ‌ర్స్ అయ్యిందే... మ‌డ‌మ తిప్పేశారే...?

టాలీవుడ్ నుండి వచ్చి గిన్నిస్ బుక్ కి ఎక్కిన యాక్టర్స్ వీరే

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>