PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/complaint-to-election-commission-against-ap-fibernetc0d4bf31-a056-43a7-b703-268961e81682-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/complaint-to-election-commission-against-ap-fibernetc0d4bf31-a056-43a7-b703-268961e81682-415x250-IndiaHerald.jpgటీవీ ఆన్ చేస్తే వెంటనే ఆ ఫొటో ప్రత్యక్షం అవుతుంది. గతంలో ఇలాంటి ఏర్పాటు లేకపోయినా.. ఇప్పుడు కొత్తగా ఏపీలో ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవారి టీవీల్లో సీఎం జగన్ బొమ్మ ప్రత్యక్షం అవుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ కి విరుద్దంగా ఇలా ప్రభుత్వం తరపున వైసీపీకి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం జగన్‌ ఫొటో రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. ఏపీలో 10లక్షల ఫైబర్ ‌నెట్‌ కనెjagan-nimmagadda-elections;ashok;jagan;sri venkateswara swamy;television;panchayati;minister;governor;press;tdp;buddha venkanna;election commission;reddy;varla ramaiah;party;bonda umamaheswara raoటీవీ ఆన్ చేస్తే చాలు ఆ ఫొటో వస్తోంది..టీవీ ఆన్ చేస్తే చాలు ఆ ఫొటో వస్తోంది..jagan-nimmagadda-elections;ashok;jagan;sri venkateswara swamy;television;panchayati;minister;governor;press;tdp;buddha venkanna;election commission;reddy;varla ramaiah;party;bonda umamaheswara raoSun, 07 Feb 2021 12:00:00 GMTటీవీ ఆన్ చేస్తే వెంటనే ఆ ఫొటో ప్రత్యక్షం అవుతుంది. గతంలో ఇలాంటి ఏర్పాటు లేకపోయినా.. ఇప్పుడు కొత్తగా ఏపీలో ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవారి టీవీల్లో సీఎం జగన్ బొమ్మ ప్రత్యక్షం అవుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్ కి విరుద్దంగా ఇలా ప్రభుత్వం తరపున వైసీపీకి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం జగన్‌ ఫొటో రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. ఏపీలో 10లక్షల ఫైబర్ ‌నెట్‌ కనెక్షన్లు ఉన్నాయని, వాటన్నిటిలో టీవీ ఆన్‌ చేయగానే.. డిఫాల్ట్‌ గా కింద  సీఎం ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఫైబర్‌ నెట్ కనెక్షన్ ఉన్న టీవీల్లో  సీఎం ఫోటో రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలు ప్రతి చిన్న విషయాన్నీ హైలెట్ చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా చాలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారు. ఓ రకంగా ఈసీ తమకు కచ్చితంగా మద్దతిస్తుందన్న ఆశ కూడా వారిలో ఉంది. అందుకే ప్రతి విషయాన్నీ వారు ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా ఫైబర్ నెట్ పై ఫిర్యాదు చేశారు.
ఏకగ్రీవాలపై ఇప్పటికే పలు చోట్ల టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ప్రకటన చేయకుండా ఎస్ఈసీ అడ్డుకున్నారు. మంత్రి పెద్ది రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ ఆదేశాలిచ్చిన తర్వాత కూడా ఇంటికి పరిమితం కాకుండా.. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి పెద్ది రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు టీడీపీ నేతలు. ఆయన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. గవర్నర్ కు వినతిపత్రం అందించారు. గవర్నర్ ను కలసినవారిలో వర్ల రామయ్య, బొండా ఉమా, బుద్దా వెంకన్న, అశోక్ ‌బాబు, గద్దె రామ్మోహనరావు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>