MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja6bb8385b-11aa-4a9d-9181-6cb693d22579-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja6bb8385b-11aa-4a9d-9181-6cb693d22579-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం సంక్రాంతి రేస్ విజేతగా రవితేజా ‘క్రాక్’ మారడంతో ఇప్పటి వరకు డల్ గా కొనసాగిన రవితేజా మార్కెట్ ఊపందుకుంది. దీనితో మే లో విడుదలకాబోతున్న ‘ఖిలాడీ’ మూవీ రైట్స్ గురించి బయ్యర్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ నిర్మాతలు చెపుతున్న ఏరియా రైట్స్ కు సంబంధించిన రేట్లను చూసి బయ్యర్లు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. ‘క్రాక్’ కలక్షన్స్ ను ఆధారంగా తీసుకుని ‘ఖిలాడీ’ నిర్మాతలు ఈ రేట్స్ ను కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు స్క్రిప్ట్ లో మళ్ళీ మraviteja;ravi;ram gopal varma;kranthi;kranti;ramesh varma;makar sakranti;cinema;sankranthi;vegetable market;mass;krackఖిలాడీ ని కన్ఫ్యూజ్ చేస్తున్న క్రాక్ !ఖిలాడీ ని కన్ఫ్యూజ్ చేస్తున్న క్రాక్ !raviteja;ravi;ram gopal varma;kranthi;kranti;ramesh varma;makar sakranti;cinema;sankranthi;vegetable market;mass;krackSun, 07 Feb 2021 10:00:00 GMTసంక్రాంతి రేస్ విజేతగా రవితేజా ‘క్రాక్’ మారడంతో ఇప్పటి వరకు డల్ గా కొనసాగిన రవితేజా మార్కెట్ ఊపందుకుంది. దీనితో మే లో విడుదలకాబోతున్న ‘ఖిలాడీ’ మూవీ రైట్స్ గురించి బయ్యర్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే ఈ మూవీ నిర్మాతలు చెపుతున్న ఏరియా రైట్స్ కు సంబంధించిన రేట్లను చూసి బయ్యర్లు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. ‘క్రాక్’ కలక్షన్స్ ను ఆధారంగా తీసుకుని ‘ఖిలాడీ’ నిర్మాతలు ఈ రేట్స్ ను కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేసి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ భారీ యాక్షన్ సీన్స్ కు అదేవిధంగా ఆ యాక్షన్ సీన్స్ కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కు భారీగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. దీనితో ఈమూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో ఈమూవీ రైట్స్ కు సంబంధించి రేట్లు కూడ బాగా పెరిగాయి అని అంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి రేస్ కు వచ్చిన సినిమాలలో ‘క్రాక్’ కు పోటీ ఇవ్వగల మరొక సినిమా విడుదల కాలేదు. దీనికితోడు కరోనా పరిస్థితులు వల్ల ధియేటర్లకు దూరంగా ఉన్న ప్రేఖకులు ఒక్కసారి ఒక మాస్ సినిమాను చూడటంతో ‘క్రాక్’ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.


అయితే సమ్మర్ రేస్ పరిస్థితి వేరు ఈసారి సమ్మర్ సీజన్ కు ఎప్పుడు లేని విధంగా టాప్ హీరోల సినిమాలు అన్నీ లైన్ కడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇన్ని సినిమాల మధ్య విడుదల కాబోతున్న ‘ఖిలాడీ’ మూవీకి ‘క్రాక్’ స్థాయిలో కలక్షన్స్ వస్తాయి అని ఆశించడం దురాశ అవుతుందని ఈ మూవీని కొనాలని ఉత్సాహ పడుతున్న బయ్యర్లు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ మూవీ దర్శకుడు రమేష్ వర్మ సమర్థత పై కూడ కొన్ని సందేహాలు ఉండటంతో ఈ మూవీని కొనాలని అనుకుంటున్నా బయ్యర్లు కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు టాక్..  





జక్కన్న ఆలోచన మామూలుగా లేదుగా.. మహేశ్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడట..

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>