PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpgమరోవైపు.. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు అనంతలక్ష్మి దంపతులతో సంప్రదింపులు జరిపి ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. అయినా వారు పార్టీలో ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటారో ? తెలియ‌ని ప‌రిస్థితి. అయితే.. లోపాయికారీగా వీరు వైసీపీతో మంత్రాంగం చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పిల్లి అనంత‌ల‌క్ష్మికి పార్టీలో కీల‌క ప‌ద‌వుల విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌నేవాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. త‌మ‌ను ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌న పెడుతున్నార‌ని,tdp ysrcp;ramakrishna;రాజీనామా;district;east;mla;minister;husband;letter;tdp;kakinada;partyవైసీపీలోకి `పిల్లి` కుటుంబం... టీడీపీకి షాక్ ?వైసీపీలోకి `పిల్లి` కుటుంబం... టీడీపీకి షాక్ ?tdp ysrcp;ramakrishna;రాజీనామా;district;east;mla;minister;husband;letter;tdp;kakinada;partySun, 07 Feb 2021 10:35:39 GMTతూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీలో భారీ కుదుపు ఏర్ప‌డింది. జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి టీడీపీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అయితే..  పార్టీలో క్రియాశీలక సభ్యులుగా కొనసాగుతామని చెప్పారు. పార్టీలో మాజీ మంత్రి , పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయని.. ఆయన తనను ఇబ్బందులు పెడుతున్నారని సత్యనారాయణమూర్తి చెప్పారు. మరోవైపు.. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు అనంతలక్ష్మి దంపతులతో సంప్రదింపులు జరిపి ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. అయినా వారు పార్టీలో ఎప్ప‌టి వ‌ర‌కు ఉంటారో ?  తెలియ‌ని ప‌రిస్థితి.

అయితే.. లోపాయికారీగా వీరు వైసీపీతో మంత్రాంగం చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పిల్లి అనంత‌ల‌క్ష్మికి పార్టీలో కీల‌క ప‌ద‌వుల విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌నేవాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. త‌మ‌ను ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌న పెడుతున్నార‌ని, మాజీ మంత్రి చిన‌రాజ‌ప్ప‌జోక్యంతోనే త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. వారు త‌ర‌చుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ విష‌యంతోనే పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా స‌మ‌ర్పించారు.

త్వ‌ర‌లోనే వీరు వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన క‌న్న‌బాబు.. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. ఈయ‌న క‌నుస‌న్న‌ల్లోనే వీరు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని అంటున్నారు. ఏదేమైనా.. త్వ‌ర‌లోనే వారు వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.  


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>