Educationyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/adhaar-cardef05d58b-beba-43df-9009-f9ae3924c5a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/adhaar-cardef05d58b-beba-43df-9009-f9ae3924c5a7-415x250-IndiaHerald.jpgఎవరైనా ఎంత అందంగా ఉన్నారో తెలియాలంటే వాళ్ళ ఆధార్ కార్డ్ ఫోటో చూడాలనే జోకు ఎప్పటి నుంచో ఉంది. ఆధార్ కార్డ్ లో అంత ఘోరంగా ఫోటోలు ఉంటాయని ఈ రకంగా జోకుల్లో చెబుతుంటారు. ఫోటోలు బాగాలేక, ఏమీ చేయలేక చాలామంది వాళ్ళ ఆధార్ బయటకు కూడా చూపించరు. అయితే ఆధార్ కార్డులో..adhaar card;india;biometric;central government;aadhar;uidaiఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా.. ఇలా సింపుల్ గా మార్చుకోండిఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా.. ఇలా సింపుల్ గా మార్చుకోండిadhaar card;india;biometric;central government;aadhar;uidaiSun, 07 Feb 2021 20:36:00 GMTఆధార్ కార్డ్ ఫోటో చూడాలనే జోకు ఎప్పటి నుంచో ఉంది. ఆధార్ కార్డ్ లో అంత ఘోరంగా ఫోటోలు ఉంటాయని ఈ రకంగా జోకుల్లో చెబుతుంటారు. ఫోటోలు బాగాలేక, ఏమీ చేయలేక చాలామంది వాళ్ళ ఆధార్ బయటకు కూడా చూపించరు. అయితే ఆధార్ కార్డులో ఫోటోను చాలా సులభంగా మార్చుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలీదు. అలాంటి వారికోసమే ఇప్పుడీ విషయం.

ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలను మార్చినట్టే, ఫోటోను కూడా మార్చుకోవచ్చు. అదేమంత పెద్ద కష్టం కాదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆన్‌లైన్‌లోనే చాలావరకు వివరాలను అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది. పేరు, అడ్రెస్ వంటి వివరాలను అప్‌డేట్ చేయాలంటే ఆన్ లైన్ లొనే అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే ఫోటో, బయోమెట్రిక్ వంటి కీలక అంశాల మార్పునకు మాత్రం ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. ఫోటో, బయోమెట్రిక్ డీటెయిల్స్ మార్చడానికి ముందుగా ఆధార్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి.

ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లేముందే మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ తేదీ ప్రకారం.. ఆధార్ సెంటర్‌కు వెళ్ళాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అక్కడి సిబ్బందికి ఇవ్వాలి. అందులో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి డీటెయిల్స్ రాయాలి. ఆ తర్వాత ఆధార్ కేంద్రంలోని ఎగ్జిక్యూటీవ్ మీ లేటెస్ట్ ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత మీ బయోమెట్రిక్స్ వివరాలతో అప్రూవ్ చేయడం జరుగుతుంది. మీ ఫోటో అప్‌డేట్ చేయడానికి రూ.25+జీఎస్‌టీ సొమ్మును మీరు చెల్లించాల్సి ఉంటుంది. మీ ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఒకవేళ పీవీసీ కార్డ్ కావాలంటే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆధార్ కార్డులో ఫోటో నచ్చని వారంతా ఇక వెంటనే మరో అందమైన ఫోటోను జత చేసుకోండి.


జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>