PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9389e419-079e-4373-ad91-d1d066aad385-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9389e419-079e-4373-ad91-d1d066aad385-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. రాను రాను వైసీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఎన్నికల కమిషనర్‌తో ప్రభుత్వ పెద్దల ఘర్షణ ఓ రేంజ్‌ వరకూ ఉన్నా.. ఇప్పుడు అది మరీ శ్రుతి మించుతోండి. నిమ్మగడ్డను మంత్రులు టార్గెట్ చేయడం.. దీన్ని నిమ్మగడ్డ కూడా సీరియస్‌ గా తీసుకుని ప్రతి చర్యలకు దిగడంతో.. మొత్తం మీద వేడి బాగా రాజుకుంటోంది. తాజాగా ఆయన ఏకంగా ఓ మంత్రిని గృహనిర్భందం చేయాలని ఆదేశాలివ్వడంతో వైసీపీ నేతలు అవాక్కవుతున్నారు. jagan-nimmagadda-elections;cbn;kumaar;pithe;andhra pradesh;king;minister;alla ramakrishna reddy;tdp;ycp;gharshana;mantraజగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?jagan-nimmagadda-elections;cbn;kumaar;pithe;andhra pradesh;king;minister;alla ramakrishna reddy;tdp;ycp;gharshana;mantraSun, 07 Feb 2021 06:00:00 GMTఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. రాను రాను వైసీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఎన్నికల కమిషనర్‌తో ప్రభుత్వ పెద్దల ఘర్షణ ఓ రేంజ్‌ వరకూ ఉన్నా.. ఇప్పుడు అది మరీ శ్రుతి మించుతోండి. నిమ్మగడ్డను మంత్రులు టార్గెట్ చేయడం.. దీన్ని నిమ్మగడ్డ కూడా సీరియస్‌ గా తీసుకుని ప్రతి చర్యలకు దిగడంతో.. మొత్తం మీద వేడి బాగా రాజుకుంటోంది. తాజాగా ఆయన ఏకంగా ఓ మంత్రిని గృహనిర్భందం చేయాలని ఆదేశాలివ్వడంతో వైసీపీ నేతలు అవాక్కవుతున్నారు.

నిమ్మగడ్డ త‌ప్పుల‌ను ఎత్తిచూపితే గృహ నిర్బంధం అంటారా? అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తిచూపితే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని గృహ నిర్బంధం చేయాల‌ని ఆదేశాలు ఇవ్వడం ఏంటని వైసీపీనేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎస్ఈసి ఎన్నికల పనులను మార్గదర్శకంగా చేయాలే త‌ప్ప..తన బాధ్యత మరచి పరిమితిని మించి నిమ్మగ‌డ్డ ప్రవర్తిస్తున్నార‌ని త‌ప్పుబడుతున్నారు. రాష్ట్రంలో సర్వాధికారాలు తనకే ఉన్నాయన్నట్టు నిమ్మగడ ధోరణి ఉంద‌ని విమర్శిస్తున్నారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలపై డిక్లరేషన్ ఇచ్చాక నిలిపివేయ‌డాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చట్టవ్యతిరేక నిర్ణయంగా చెబుతున్నారు. ఎప్పటి లాగే ఏకగ్రీవాలు జరిగాయి తప్ప అధిక సంఖ్యలో లేవని చెబుతున్నారు. ఏకగ్రీవం పై విచారణ చేస్తే ప్రజల నుంచి నిమ్మగడ కు వ్యతిరేకత వ‌స్తుంద‌ని వైసీపీ నేతలు అంటున్నారు. ఏకగ్రీవాలను కారణంగా చుపి మంత్రి పెద్దిరెడ్డి  గృహానిర్బంధం నిర్ణయం తీసుకోవ‌డం స‌రికాద‌ని వైసీపీ నేతలు అన్నారు. గ్రామాల అభివృద్ధికోసమే ఏకగ్రీవం తప్ప మరేమీ కాదు అని స్పష్టం చేశారు. ఏకగ్రీవం జరిగేది అక్రమం అంటున్న నిమ్మగడ వివరణ ఇవ్వాల‌ని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ ప్రతిప‌క్ష నేత చంద్రబాబుకు ఏజెంట్‌గా, టీడీపీ కార్యక‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మండిప‌డ్డారు. నిమ్మగ‌డ్డ తాటాకు చ‌ప్పుళ్లకు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌ను సాకుగా చూపి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని గృహ నిర్భందం చేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం సిగ్గు చేటు అన్నారు.




సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా.. !

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>