ViralMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/andhrapradesha0a3f98c-4955-413f-a93d-5750cfe8f36d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/andhrapradesha0a3f98c-4955-413f-a93d-5750cfe8f36d-415x250-IndiaHerald.jpgఏపీలో మద్యం ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు భారీగా పెరిగిపోయాయి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే సగానికి సగం పెరిగాయి. దాంతో మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాల్సిన బ్రాండ్ లు కూడా ఏపీలో దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో దర్శనం ఇస్తున్న కొత్త బ్రాండ్ లపై మండిపడ్డారు. మద్యంandhrapradesh;darshana;bharatiya janata party;korcha;andhra pradesh;media;car;chequeఏపీలో మద్యం ధరలు తగ్గించాలి..మండుటెండలో మందుబాబు నిరసనఏపీలో మద్యం ధరలు తగ్గించాలి..మండుటెండలో మందుబాబు నిరసనandhrapradesh;darshana;bharatiya janata party;korcha;andhra pradesh;media;car;chequeSun, 07 Feb 2021 13:06:51 GMTఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు ఒక్కసారిగా 75శాతానికి పెరగటంతో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవలే ఓ మందుబాబు మీడియా ముఖంగా వాపోయాడు. బీజేపీ కీలక నేత ఒకరు ఈ మద్యే రాష్ట్రంలో నాణ్యమైన బీరు కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో మద్యం ధరలు ఆకాశాన్ని తాకడంతో కొంతమంది పక్క రాష్ట్రాల నుండి మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. దొరికిన వారిని బొక్కలో వేస్తున్నారు. తాగటానికే కాకుండా పక్క రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి ఏపీలో అమ్ముతున్నారు. అయితే సరిహద్దుల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం పక్క రాష్ట్రాలకు వెళ్లి పూటుగా మద్యం తాగి వస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీలో మద్యం ధరలు తగ్గించాలంటూ ఓ మందు బాబు నిరసనకు దిగాడు. కుప్పం చిత్తూరు రహదారిపై మండుటెండలో కూర్చుని నిరసనకు దిగాడు. వెంటనే మద్యం ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. అక్రమంగా మద్యం అధిక ధరలకు అమ్ముతున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఈ మందు బాబు కిక్కులో ఉన్నాడో ఏమోగానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కడే నిరసనకు దిగాడు. మరి ఈ నిరసన కారుడి డిమాండ్ ను ప్రభుత్వం నెరవేరుస్తుందా.? లైట్ తీసుకుంటుందా చూడాలి.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>