PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/attacks-on-hindu-religion718d012a-d57a-40eb-a060-4e2327bb7845-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/attacks-on-hindu-religion718d012a-d57a-40eb-a060-4e2327bb7845-415x250-IndiaHerald.jpgఒకరు దెవుణ్ణి నమ్మినా, నమ్మకున్నా లక్షలాది మంది విశ్వాసం, నమ్మకం మాత్రం ఊర్కే పొదు. మహొన్నతమై విశ్వాసాన్ని వంచించిన వారికి, శాపమై తప్పక తగుల్కొంటుంది. అదే జరగకుండా చూసుకోవలసిన అవసరం వైసిపి నాయకత్వానికి అత్యవసరం ఇప్పుడు. నాయకుడు క్రిష్టియన్ అవచ్చు కాకపొవచ్చు. ప్రజలకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన క్రిష్టియన్ అని జనం ఆయన్ని గెలిపించలేదు. మంచి పాలన యివ్వగలడని నమ్మారు. ఆయన ఆ నమ్మకంపై విశ్వాసం ఉంచకపొతే పతనం ప్రారంభమైనట్లే. attacks on hindu religion;nani;darshana;bharathi old;bhuvaneshwari;chakravarthy;deva;dharma;kanchi;kodali nani;ramu;sampada;tara;tiru;vishnu;andhra pradesh;industries;vishakapatnam;police;tirupati;media;chief minister;industry;minister;tamilnadu;christian;husband;silver;letter;news;kanchipuram;ycp;tuni;rama tirtha;hindus;v;kavuru srinivas;nara bhuvaneshwari;shakti;mantraదేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?attacks on hindu religion;nani;darshana;bharathi old;bhuvaneshwari;chakravarthy;deva;dharma;kanchi;kodali nani;ramu;sampada;tara;tiru;vishnu;andhra pradesh;industries;vishakapatnam;police;tirupati;media;chief minister;industry;minister;tamilnadu;christian;husband;silver;letter;news;kanchipuram;ycp;tuni;rama tirtha;hindus;v;kavuru srinivas;nara bhuvaneshwari;shakti;mantraSun, 07 Feb 2021 08:00:00 GMTఇండస్ట్రీ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి వెంటనే మాజీ అయిపోయాడు. అది దేవదేవతలు శపించిన ఫలితమె అనుమానం లేదని అంటున్నారు. ఎందుకంటే దేవ దేవతలను లక్షల మంది నమ్ముతారు. ఆ నమ్మకం, భక్తి తత్పరతలే, ఒక మహోన్నత శక్తి. నిబిడీకృతమై దైవశక్తి.


ఒకరు దెవుణ్ణి నమ్మినా, నమ్మకున్నా లక్షలాది మంది విశ్వాసం, నమ్మకం మాత్రం ఊర్కే పొదు. మహొన్నతమై విశ్వాసాన్ని వంచించిన వారికి, శాపమై తప్పక తగుల్కొంటుంది. అదే జరగకుండా చూసుకోవలసిన అవసరం వైసిపి నాయకత్వానికి అత్యవసరం ఇప్పుడు. నాయకుడు క్రిష్టియన్ అవచ్చు కాకపొవచ్చు. ప్రజలకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన క్రిష్టియన్ అని జనం ఆయన్ని గెలిపించలేదు. మంచి పాలన యివ్వగలడని నమ్మారు. ఆయన ఆ నమ్మకంపై విశ్వాసం ఉంచకపొతే పతనం ప్రారంభమైనట్లే.


ఆంధ్రప్రదేశ్ లొ హిందూ మతం అవస్థల పాలౌతుంది. అనుమానం లేదు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, క్రమంగా హిందువుల సాంప్రదాయాలను సంస్కృతిని  కాలరాస్తు వస్తుంది. ఇప్పటి పాలనలో ప్రతిదానికి హిందువుల మనసు క్షోభిస్తుంది. ఈ ప్రజాస్వామ్య సమాజంలో హిందువులు ఎంతటి మెజారిటి పక్షమైనా, ఏనాడు వారు ఇతర మతాల వారికి హాని చెయ్యలేదు.


కాని ఏపిలో వైసీపి పాలన మొదలైననాటి నుండి ఏనాడులేని విధంగా ప్రతి వీధిలో, గ్రామం మొదలు, మధ్య, చివరలొ, ప్రశాంతమైన పురాతన దేవాలయాల ప్రాంగణాల సమీపాన, చిన్న చిన్న హిల్స్ మీదా లెక్కకు మిక్కిలిగా "చర్చీలు" వెలుస్తున్నాయి. ప్రేయర్స్ కు అన్ని చర్చిలు అవసరమా?  


ఎప్పుడూ మతం గురించి ఆలోచించని ఇక్కడి హిందూ సమాజం - లోలోపల తీవ్ర వేదనకు - గురికాని రోజు లేదు. హిందూ దైవదూషణ, దేవీ, దేవతల విగ్రహాల ద్వంసం, దేవాలయాల విధ్వంసం వీటిపై జనం స్పందిస్తె ఆందోళన వ్యక్తపరిస్తే ప్రభుత్వ సమాధానాలు, పోలీసుల విచారణలు నమ్మశక్యంగా లేవు సరికదా! వినేవాళ్ళు అమాయకులైతే చెప్పెవాళ్ళు వైసీపి నాయకులౌతారు.జనం నమ్ముతున్నారని వారు  అనుకుంటున్నారు లాగుంది. గతంలొ ముఖ్యమంత్రి అలాగే అనుకున్నారు. కాని ఎన్నికల్లొ ప్రజలు ఆయనకు పతనం చూపించారు.


హిందూ మతాన్ని, హైందవ సమాజాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో వరుసఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వం ఏదో పనికిమాలిన పిట్టకథలు చెప్పి తప్పించుకుంటుంది.


రథాలు తగలబడితే “తేనేటీగలు” కారణమని,
ఆలయాలపై దాడులు జరిగితే “పిచ్చోడి చర్య” అని,
విగ్రహాల విధ్వంసం “గుప్తనిధుల వేటగాళ్ల పని” అని రాష్ట్రంలో వరుస ఘటనలపై ప్రభుత్వం వివరణ ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో, 
                                                                                 

ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా?
రాముడి విగ్రహం తల తెగిపడితే ప్రాణం పోతుందా?


అని మంత్రి కొడాలి నాని లాంటి దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించని, స్వప్రయోజనాలే ప్రామాణికం గా పనిచేసే వారి వింత వింత వ్యాఖ్యలు సరేసరి!


స్వయానా  దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ నివాసానికి సమీపంలో దుర్గమ్మ రథం వెండి సింహాలు మాయమవటం దానిపై పొంతన లేని వ్యాఖ్యలు చేసిన పాలకుల తీరును కొన్ని నెలలుగా పీఠాధిపతులు, సాధుసంతులు గమనిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి హిందువుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సంపద, ఆదాయం, అవకాశాలను మైనార్టీల మెప్పు కోసం దారి మళ్లించి దుర్వినియోగం చేయటం హిందువుల అలజడికి ఆజ్యం పోసింది.


తిరుమల నుంచి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్నాయన్న ఆవేదనను ఆగ్రహాన్ని పుష్పగిరి పీఠాధిపతి వ్యక్తం చేసినట్లుగా చెప్పారు. దైవ అపచారాలు అనాచారాలు అరాచకాలు వరుసగా జరుగుతున్నా పిల్లి కళ్లు మూసుకొని తన నెవరు గమనించట్లేదని అనుకుంటూ పాలు తాగే చందంగా ప్రవర్తిస్తున్న తీరు, ఎవరు గమనించట్లేదని అనుకోవటం వారి అవివేకానికి నిదర్శనం. అంతేకాదు ఆ తీరు వైసీపి ప్రభుత్వానికి అత్యంత షాకింగ్ గా మారనున్నదని గ్రహించక పోవటం వారి లొని అహంభావానికి గర్వాంధకారానికి నిదర్శనం. ఆ నాయకత్వ తీరు ఎన్నటికి క్షమార్హం కాదు.


మరో వైపు హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే ధ్వంసం చేశానని కాకినాడకు చెందిన “పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి” అనబడే మతవాది విడుదల చేసిన వీడియో హిందు సమాజంలొ అలజడి రేపింది. ఈ అలజడి హిందూ పీఠాధిపతులు, సాధుసంతులు, స్వామీజీల వరకు చేరింది. ఈ పరిణామా లపై కలత చెందిన సాధుస్వభావులంతా కలత చెందారు. అందరు దీనికి పరిష్కారం వెతుకులాటలో సమావేశం కావాలని నిర్ణయించారు.


ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పొన్పాడి గ్రామం శివారులోని కంచిపీఠానికి చెందిన ఆశ్రమంలో బుధవారం రాత్రి “సనాతన ధర్మ పరిరక్షణ” పేరిట సదస్సు జరిగింది. ఏపీ, తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు, ఉత్తరాధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.హైందవ సమాజానికి ధైర్యాన్నిచ్చేలా సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు.

కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి,
దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ప్రతినిధి గౌరీశంకర్‌,
హంపీ విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యారణ్య భారతి,
పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి,
తుని సచ్చిదానం తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి,
అహోబిల మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి,
ముముక్షు జన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం,
కంచి మఠం ప్రతినిధి చల్లా విశ్వనాథ శాస్త్రి
సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంవీఆర్‌ శాస్ర్తి, తదితరులు అందులో పాల్గొన్నారన్నారు. ఈ సమావేశ వివరాలను తిరుపతి ప్రెస్‌క్లబ్ ‌లో భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి కమలానంద భారతి స్వామి మీడియాకు వెల్లడించారు.


సనాతన ధర్మం, హిందూ విశ్వాసాలు, ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఏపీలో వందలాది ఆలయాలను ధ్వంసం చేయడాన్ని సదస్సు తీవ్రంగా పరిగణించిందన్నారు.


రామతీర్థంలో రాముడి తల ధ్వంసం చేయడం స్వామీజీలకు ఆవేదన కల్గించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అన్యమత ప్రచారం, మైనారిటీల మెప్పుకోసం హిందూ ఆలయాల ఆదాయాన్ని దామళ్లింపు సదస్సు తప్పుబట్టిందని తెలిపారు. హిందూ మతాన్ని మట్టుపెట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సదస్సులో వక్తలు డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.


దక్షిణాదిన హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల గురించి విస్తృతంగా చర్చించారు. తమది రహస్య సమావేశం కాదని చెప్పినా, అదే నిజమైతే ముందుగా ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వనట్లు? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇక సమావేశానికి పెద్ద ఎత్తున స్వామీజీలు హాజరయ్యారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, పెరుగుతున్న అన్యమత ప్రచారంపై పీఠాధిపతులు, ఉత్తరాధికారులు, సాదుసంతులు, భక్తితత్పరులైన ప్రజలు ఏకమయ్యారు.


మాజీ న్యాయమూర్తులు, నిపుణుల ద్వారా ఆలయాల నగలను, ఆస్తులను కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కంచి కామకోటి శంకర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో తిరుపతి వేదికగా త్వరలోనే మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించి నట్లు చెప్పారు.


వారు భేటీ కానున్నారని ముందుగనే తెలుసుకున్న సర్కారు, హుటాహుటిన మంత్రులను రంగంలోకి దించింది. సమావేశాల ఆలోచన విరమించుకోవాలని జరిపిన రాయబారం ఫలించలేదు. పీఠాధిపతులు ఐక్య కార్యాచరణకు నడుం బిగించడానికి సిద్ధమవటంతో వైసీపి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.


మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి, అంతర్వేది ఆలయ రథాన్ని తయారు చేయించామని, ఫిబ్రవరిలో ఆలయానికి అందజేస్తా మని చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ముందు సాష్టాంగ నమస్కారం చేసి విగ్రహాల విధ్వంసం జరగడం లేదని, గుప్త నిధుల ముఠాలు చేస్తున్న పనిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు.


సిద్ధేశ్వరి పీఠాధిపతి కుర్తాళం శంకరాచార్యుల ఆశీస్సుల కోసం ప్రయత్నం చేశారు. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పాదాలపై పడి ఆలయాల ఘటనల్లో బాధ్యులపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు.


ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఒక మఠాధిపతి గంట గంటకు మత మార్పిళ్లు జరుగుతాయని చెప్పిన 'పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి' పై చర్యలు తీసుకున్నారా? ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి? అని నిలదీయటంతో తలెక్కడ పెట్టుకోవాలో జన్మతః హిందువులైన ప్రభుత్వ ప్రతినిధులకు అర్ధం కాలేదట.


పష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతి స్వామి మాట్లాడుతూ తిరుమల నుంచి శ్రీశైలం వరకు అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. ఏపీలో దేవదాయశాఖ పనితీరు బాగోలేదన్నారు. ఆలయాల ఆదాయాన్ని లౌకిక విధానం ప్రకారం ప్రజా సంక్షేమంపేరుతో ఖర్చు చేయకూడదని తెలిపారు

 
పురావస్తుశాఖ పరిధిలోని ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని కోరారు. దేవాలయాల్లో భక్తసంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పారు. పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని పోరాటం చేయాలని నిర్ణయించారు. త్వరలో తిరుపతిలో భారీసభ నిర్వహిస్తామని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి ప్రకటించారు.


ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి దూతలు చెప్పినవన్నీ విన్నస్వామీజీలు దూరం నుంచే ఆశీర్వదిస్తూ వెళ్లిరమ్మంటూ చేయిఊపి పంపేసినట్లు సమాచారం. ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


అయితే స్వామిజీలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేసుంటున్నట్లు ఇంటలిజెన్స్ సమాచారంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అలాంటి పరిస్థితే వస్తే, తమపై పడిన క్రిస్టియన్ ముద్ర మరింత విస్తృతం అవుతుందని, హిందూ ఓట్లన్నీ వ్యతిరేకం అవుతాయని ఆందోళన చెందారు. విరుగుడుగా మంత్రి వెల్లంపల్లితో పాటు ‘బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్’ మల్లాది విష్ణును రంగంలోకి దించారు. అన్ని పీఠాలకు వెళ్లి స్వామిజీల దర్శనం చేసుకుని, కానుకలు సమర్పించుకుని, పరిస్థితుల గురించి వివరించి చెప్పి రావాలని పంపారు.


వారు కూడా, మూడు రోజుల పాటు అన్ని పీఠాలకు దిగారు. నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పీఠాలకు వెళ్లారు. ఈ ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో అంతా బాగానే వుందని, చెదురు మదురు ఘటనలు మాత్రమే జరుగుతున్నాయని కొన్ని మీడియా సంస్థల హడావుడి మాత్రమే నని పీఠాధిపతులకు గౌరవంగా చెప్పి వచ్చారు. తమకు అనుకూలంగా ఉండే ఒకరిద్దరు స్వాములద్వారా అన్ని పీఠాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుని తమపై హిందూ వ్యతిరేక ముద్ర మరింత బలంగా పడకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు.


కొంత మంది పీఠాధిపతులతో ప్రభుత్వం సన్నిహితంగా ఉంటోంది. వారికి కావాల్సిన పనులు చేస్తోంది. కావాల్సింత గౌరవం ఇస్తోంది. దాంతో వారు ఏపీలో ఏం జరిగినా, హిందూత్వంపై దాడి జరిగినా స్పందించడం లేదు. కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగని హిందూత్వం మీద మాత్రమే నమ్మకం ఉంటే పీఠాలు మాత్రం ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నాయి. వారంతా ఏపీలో హిందూత్వ పరిరక్షణకు నడుం కట్టబోతున్నారన్న సమాచారం బయటకు వచ్చింది.


ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధులు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముందు (తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి రాజకీయ ప్రయోజనాలు పొందే రాజగురువు) దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సాష్టాంగపడి ఆయన ఆశీర్వచనం పొందారు. ఈ స్థాయిలో చర్చించుకున్న హిందూ పీఠాధిపతులు అవకాశవాదైన స్వరూపానందేంద్ర సరస్వతి మాట విని తమ ఆలొచనలను విరమించు కోవటం అసంభవం అంటున్నారు.





లేడీ గెటప్లో బుల్లెట్ భాస్కర్.. చూస్తే పగలబడి నవ్వుతారు..?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>