PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-electionsc8dae1bb-61f8-4383-b7f0-1d8560ebe3fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-electionsc8dae1bb-61f8-4383-b7f0-1d8560ebe3fc-415x250-IndiaHerald.jpgఏపీలో ఇపుడు జరుగుతున్నవి పంచాయతీ ఎన్నికలా లేక రెండు వ్యవస్థల మధ్య పోరు సాగుతుందా అన్న దాని మీద ఎవరికీ ఏమీ అర్ధం కావడంలేదు. ఈ మధ్యలో పడి అన్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులు నలిగిపోతున్నారు. నిజానికి ఎన్నికల వేళ ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉంటాయన్నది నిజం. అయితే ఏ అధికారాలు అయినా రాజ్యాంగానికి లోబడే ఉంటాయి. jagan-nimagadda-elections;amala akkineni;kumaar;peddireddy ramachandra reddy;government;police;panchayati;minister;arrest;ycp;house;marchజగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?jagan-nimagadda-elections;amala akkineni;kumaar;peddireddy ramachandra reddy;government;police;panchayati;minister;arrest;ycp;house;marchSun, 07 Feb 2021 10:30:00 GMTపంచాయతీ ఎన్నికలా లేక రెండు వ్యవస్థల మధ్య పోరు సాగుతుందా అన్న దాని మీద ఎవరికీ ఏమీ అర్ధం కావడంలేదు. ఈ మధ్యలో పడి అన్యాయంగా ప్రభుత్వ ఉద్యోగులు నలిగిపోతున్నారు. నిజానికి ఎన్నికల వేళ ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉంటాయన్నది నిజం. అయితే ఏ అధికారాలు అయినా రాజ్యాంగానికి లోబడే ఉంటాయి.

మరో వైపు చూస్తే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు మీద ఉన్నారు. ప్రభుత్వం విషయంలో చిన్న తప్పు జరిగినా  తాను సహించను అంటూ ఆయన పవర్ ఫుల్ మేసేజ్ ఇస్తున్నారు. అందులో భాగమే  పంచాయతీ శాఖ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్. అయితే ఇక్కడే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఎన్నికల సంఘం హద్దులు దాటుతోందని వైసీపీ నేతలు వరసపెట్టి ఆరోపణలు చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే నిమ్మగడ్డ  ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా అక్కడ అమలు చేయాల్సింది పూర్తిగా  ప్రభుత్వ అధికారులు. మరి వారు ప్రభుత్వం మాట విని ఊరుకుంటారా. లేక ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తారా అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. నిమ్మగడ్డ మార్చి 31తో పదవీ విరమణ చేస్తారు. మరి ఆయన చెప్పినట్లు ఉంటే మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దాంతో ప్రభుత్వంతో అధికారులు ఏ  గొడవ పడలేదు. అలాగని ఇపుడున్న స్థితిలో నిమ్మగడ్డ మాట వినకపోతే తక్షణం ముప్పు వస్తుంది.

దీంతో ప్రభుత్వ అధికారులు డైలామాలో పడిపోతున్నారు. ఇంకో వైపు రాజ్యాంగం ప్రకారం నిమ్మగడ్డ ఆదేశాలను తప్పకుండా పాటించి తీరాలి. ఒకవేళ ఆయన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే మాత్రం దాన్ని కోర్టు ద్వారానే న్యాయం కోసం అభ్యర్ధించాలి  తప్ప డైరెక్ట్ గా చేయమని చెప్పకూడదు, అది  పూర్తిగా  రాజ్యాంగ ధిక్కారం అవుతుంది. ఇపుడు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయమని నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు. అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. వారు చేయకపోతే అది అతి పెద్ద  ఇబ్బందే అవుతుంది అంటున్నారు. మొత్తానికి ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం తప్పదా అన్నదే చర్చగా ఉంది.




ప్రియుడు మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య..!

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?

ఖిలాడీ ని కన్ఫ్యూజ్ చేస్తున్న క్రాక్ !

జగడ్డ : పంచాయతీ సీన్ లోకి కేంద్ర ఎన్నికల సంఘం...?

తెలంగాణా అసెంబ్లిలొ ఎమెల్యేగా విదేశీయుడు? ఇందులో కుట్ర ఎమైనా ఉందా? నియోజకవర్గానికి నేనున్నాను? అని మంత్రి అనటంలొని ఆంతర్యమేమిటి?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కేసీఆర్..

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>