MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna8d01e970-c948-4ad9-be56-7a2dffc045fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna8d01e970-c948-4ad9-be56-7a2dffc045fc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ గత కొన్ని రోజులుగా మాస్ చిత్రాల జోరు తగ్గిందని చెప్పొచ్చు.. సినిమాలు తగ్గాయని చెప్పడం కంటే ఆ సినిమాలు చేసే దర్శకులు తగ్గారని అనాలి. వివివినాయక్ , బోయపాటి శ్రీను వంటి దర్శకులు ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడడంతో ఆ తరహా సినిమాలు రావడం తగ్గాయి. మాంచి మాస్ మసాలా హిట్ కి ప్రేక్షకులు మొహం వాచిపోయారు.. అలాంటి సమయంలో వచ్చిన సినిమా క్రాక్ అందరికి ఓ రిఫ్రెష్ ని ఇచ్చింది.. మాస్ రాజా రవితేజ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. balakrishna;ravi;balakrishna;gopichand;boyapati srinu;raja;ravi teja;tollywood;cinema;industry;director;success;masala;mass;krackబాలయ్య కి క్రాక్ ఎక్కితే... సూపర్ కాంబో సెట్ అయ్యినట్లే..?బాలయ్య కి క్రాక్ ఎక్కితే... సూపర్ కాంబో సెట్ అయ్యినట్లే..?balakrishna;ravi;balakrishna;gopichand;boyapati srinu;raja;ravi teja;tollywood;cinema;industry;director;success;masala;mass;krackSun, 07 Feb 2021 22:00:00 GMTటాలీవుడ్ గత కొన్ని రోజులుగా మాస్ చిత్రాల జోరు తగ్గిందని చెప్పొచ్చు.. సినిమాలు తగ్గాయని చెప్పడం కంటే ఆ సినిమాలు చేసే దర్శకులు తగ్గారని అనాలి. వివివినాయక్ , బోయపాటి శ్రీను వంటి దర్శకులు ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడడంతో ఆ తరహా సినిమాలు రావడం తగ్గాయి. మాంచి మాస్ మసాలా హిట్ కి ప్రేక్షకులు మొహం వాచిపోయారు.. అలాంటి సమయంలో వచ్చిన సినిమా క్రాక్ అందరికి ఓ రిఫ్రెష్ ని ఇచ్చింది.. మాస్ రాజా రవితేజ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

సినిమా కు ముందు వరకు రవితేజ కి పెద్దగా హిట్ లు లేవు..  ఆయనతో సినిమాలు చేస్తున్న ప్రతి డైరెక్టర్ ఫ్లాప్ ను ఇస్తూ రవితేజ ఇమేజ్ ని డౌన్ చేశారు. దాంతో రవితేజ తనకు డాన్ శ్రీను, బలుపు వంటి మాస్ హిట్ లు అందించిన గోపీచంద్ కి ఛాన్స్ ఇచ్చాడు.. తన నమ్మకాన్ని నిలబెడుతూ రవితేజ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని.. థియేటర్లకు మాస్‍ ప్రేక్షకులను రాబట్టడానికి కావాల్సిన మసాలా అంశాలను దట్టించి పారేసిన గోపిచంద్‍ మలినేని ఈ విజయంతో తనకు, రవితేజకే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా హెల్ప్ చేసాడు.

 క్రాక్ సినిమా కు ముందు గోపీచంద్ మలినేని ప్లాప్ లు చవి చూసిన కారణంగా ఆయన్ను పలువురు హీరోలు నమ్మేందుకు సిద్దం అవ్వలేదు. కాని ఎప్పుడైతే క్రాక్ సూపర్ హిట్ అయ్యిందో అప్పటి నుండి గోపీచంద్ తో సినిమాలకు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రాక్ సినిమా సక్సెస్ నేపథ్యంలో బాలకృష్ణ స్వయంగా కాల్ చేసి గోపీచంద్ మలినేనిని అభినందించాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.ఒక మంచి మాస్ సినిమా చేశారంటూ గోపీచంద్ ను ప్రశంసించడంతో పాటు తన కోసం కూడా ఒక మంచి కథను తయారు చేయాల్సిందిగా బాలయ్య కోరాడట. తనకు సరిపోయే కథను సిద్దం చేస్తే వెంటనే సినిమా చేద్దామని బాలయ్య చెప్పడంతో వెంటనే తన వద్ద ఉన్న ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథను గోపీచంద్ చెప్పడం జరిగిందట. పల్నాటి చారిత్రాత్మక నేపథ్యం అవ్వడంతో బాలయ్య స్టోరీ లైన్ విని సినిమా చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.


పూరీకి, మాస్ మహారాజ్ ఛాన్స్ ఇచ్చేనా ..??

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>