PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-plans-for-severe-action-against-minister-peddireddyca87e8ff-b8f1-4b81-8961-7918c59b7d52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-plans-for-severe-action-against-minister-peddireddyca87e8ff-b8f1-4b81-8961-7918c59b7d52-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ ఆదేశాలు పాటిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అలా హెచ్చరించే అధికారం మీకెక్కడిది అంటూ.. నిమ్మగడ్డ, మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై ఇల్లు దాటకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల్లో ప్రెస్ మీట్ పెట్టకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే ఆ ఆదేశాలు తనకింకా అందలేదని డీజీపీ చెప్పిన గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి మరోసారి నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు మంత్రి పెjagan-nimmagadda-elections;district;peddireddy ramachandra reddy;chittoor;chittor;panchayati;court;minister;governor;press;mantraజగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..jagan-nimmagadda-elections;district;peddireddy ramachandra reddy;chittoor;chittor;panchayati;court;minister;governor;press;mantraSun, 07 Feb 2021 08:00:00 GMTమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అలా హెచ్చరించే అధికారం మీకెక్కడిది అంటూ.. నిమ్మగడ్డ, మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు ఉపక్రమించారు. ఆయనపై ఇల్లు దాటకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల్లో ప్రెస్ మీట్ పెట్టకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే ఆ ఆదేశాలు తనకింకా అందలేదని డీజీపీ చెప్పిన గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి మరోసారి నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. దీంతో మరోసారి షాకవడం నిమ్మగడ్డ వంతయింది. ఈ ప్రెస్ మీట్ పై కూడా వివరణ కోరాలని, ఆయనపై మరింత కఠిన చర్యలకు సిద్ధం కాబోతున్నారట నిమ్మగడ్డ.

పెద్దిరెడ్డి అంత పెద్ద తప్పు చేశారా..?
ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఎన్నికల విధులకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో నోటిఫికేషన్ వచ్చింది కదా, సహాయ నిరాకరణ ఎలా చేస్తారంటూ ఎస్ఈసీ అధికారులపై మండిపడ్డారు. కొంతమందిని సస్పెండ్ చేశారు, మరికొందర్ని బదిలీ చేశారు, ఇంకొందరిపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధప్డడారు. ఈ దశలో సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలకోసం అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. అయితే ఏకగ్రీవాల విషయంలో రిటర్నింగ్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ ఆదేశాల ప్రకారం ఎవరైనా ఏకగ్రీవాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే బ్లాక్ లిస్ట్ లో పెడతామని అధికారుల్ని హెచ్చరించారు. దీంతో అసలు గొడవ మొదలైంది. అటు నిమ్మగడ్డ, ఇటు ప్రభుత్వం మధ్య అధికారులు నలిగిపోతున్నారు.

నిమ్మగడ్డపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరింత తీవ్రంగా తన స్వరం వినిపించారు. తన సొంత జిల్లా చిత్తూరులో ఏకగ్రీవాలు రద్దు చేయడంతో ఆయనకి మరింత ఒళ్లు మండింది. దీంతో నిమ్మగడ్డని టార్గెట్ చేశారు. ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇచ్చారు. ఈ దశలో మంత్రి పెద్దిరెడ్డి నిమ్మగడ్డ ఆదేశాలను గౌరవించకుండా ప్రెస్ మీట్ పెట్టారు. ఎస్ఈసీ ఆదేశాలు తమకింకా అందలేదని చెబుతున్న డీజీపీ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునే సాహసం చేయకపోవచ్చు. కానీ నిమ్మగడ్డ మాత్రం మరింత గట్టిగా వ్యవహరించే అవకాశాలున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాన్ని గవర్నర్ వద్ద తేల్చుకోవాలని చూస్తున్నారాయన. 


ఐపీఎస్ ఆఫీసర్ కు కూడా తిప్పలు తప్పలేదు.. అందరు షాక్..?

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>