MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda21333193-a855-461d-b8a4-fe63f870b824-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bellamkonda21333193-a855-461d-b8a4-fe63f870b824-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనే కాదు ఏ ఇండస్ట్రీ లో అయినా వారసత్వం అనేది వుంది.. కాకపోతే టాలీవుడ్ లో అది కొంచెం ఎక్కువ వుంది.. ఒక్క హీరో వస్తే చాలు ఆ ఫ్యామిలీ నుంచి పొలోమంటూ డజను మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీ లో సెటిల్ అవుతున్నారు. అలా చాలామంది అయినా టాలెంట్ ఉన్నవారినే ప్రేక్షకులు ప్రోత్సహించారు. టాలెంట్ లేకుంటే టాప్ హీరో కొడుకైన, తమ్ముడైన జనాలు పక్కన పెట్టేస్తున్నారు.. ఇక ఇది పక్కన పెడితే బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. bellamkonda;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;ranina;rajamouli;samantha;srinivas;korea, south;bollywood;tollywood;cinema;telugu;television;hindi;industry;remake;director;jaggery;hero;heroine;chatrapathi;rakshasuduబెల్లంకొండ కి హీరోయిన్ దొరకడం లేదా..ఇదేం చిత్రం..?బెల్లంకొండ కి హీరోయిన్ దొరకడం లేదా..ఇదేం చిత్రం..?bellamkonda;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;ranina;rajamouli;samantha;srinivas;korea, south;bollywood;tollywood;cinema;telugu;television;hindi;industry;remake;director;jaggery;hero;heroine;chatrapathi;rakshasuduSun, 07 Feb 2021 21:00:00 GMTటాలీవుడ్ లోనే కాదు ఏ ఇండస్ట్రీ లో అయినా వారసత్వం అనేది వుంది.. కాకపోతే టాలీవుడ్ లో అది కొంచెం ఎక్కువ వుంది.. ఒక్క హీరో వస్తే చాలు ఆ ఫ్యామిలీ నుంచి పొలోమంటూ డజను మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీ లో సెటిల్ అవుతున్నారు. అలా చాలామంది అయినా టాలెంట్ ఉన్నవారినే ప్రేక్షకులు ప్రోత్సహించారు. టాలెంట్ లేకుంటే టాప్ హీరో కొడుకైన, తమ్ముడైన జనాలు పక్కన పెట్టేస్తున్నారు.. ఇక ఇది పక్కన పెడితే బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

అల్లుడు శీనుతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరసగా పరాజయాలు ఎదురైనా పట్టువదలకుండా ఎట్టకేలకు రీమేక్ మూవీ రాక్షసుడుతో హిట్టు కొట్టడం ఫైనల్ గా ఊరట కలిగించింది. ఈ హిట్ తో వచ్చిన ఉత్సాహంతో బెల్లంకొండ ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక శీనుకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులలో కూడా మంచి పేరుంది. ఎలాగంటే శీను నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అవుతూ.. టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతుంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని శీను త్వరలో బాలీవుడ్ హీరోగా డెబ్యూ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అల్లుడుశీనుతో మంచి టాలీవుడ్ డెబ్యూ అందించిన వివి వినాయక్ మళ్లీ బాలీవుడ్ డెబ్యూ అందించనున్నాడు.

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ కాబోతున్నాడు. అయితే తెలుగులో ఫస్ట్ సినిమాకే శీనుకు స్టార్ హీరోయిన్ సమంత జోడి కట్టింది. కానీ ఇప్పుడు హిందీలో శీను పక్కన నటించేందుకు ఆసక్తి చూపడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు ఓకే చెప్తున్నప్పటికి పారితోషికం మాత్రం అధికంగా డిమాండ్ చేస్తున్నారట. అసలు బాలీవుడ్ లో శీను డెబ్యూకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎవరికీ స్పష్టత లేదు. అలాగే డైరెక్టర్ వినాయక్ కూడా ఉత్తరాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అలాగే ఆయన ఇంతవరకు బాలీవుడ్ సినిమాలు చేయలేదు. ఇద్దరూ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందినవారే. కేవలం తన హిందీ డబ్బింగ్ సినిమాలకు రెస్పాన్స్ బాగుందనే ఒక్క విషయంతో ముందుకు వెళ్తే మాత్రం పప్పులో కాలేసినట్లు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.


పెళ్ళి చేసుకోక ముందు శ్రీదేవి ఎవర్ని ప్రేమించిందో తెలుసా..??

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి మరొక బిగ్ అప్ డేట్ రెడి...??

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>