PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections68c4d3f6-756c-4bd1-aa5c-ce3cdc8eefb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections68c4d3f6-756c-4bd1-aa5c-ce3cdc8eefb8-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికలు తొలి విడత పోలింగ్ ఈ నెల 9న జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తొలి విడతలో విశాఖ జిల్లాలోని అనకాపల్లి డివిజన్ ఉంది. ఇక్కడ మూడు వందల పంచాయతీలకు మూడు వేల దాకా ఉన్న వార్డు మెంబర్లకు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. jagan-nimmagadda-elections;view;anakapalle;vishakapatnam;panchayati;minister;tdp;ycp;dookudu;party;shaktiజగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?jagan-nimmagadda-elections;view;anakapalle;vishakapatnam;panchayati;minister;tdp;ycp;dookudu;party;shaktiSun, 07 Feb 2021 17:37:19 GMTపంచాయతీ ఎన్నికలు తొలి విడత పోలింగ్ ఈ నెల 9న జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తొలి విడతలో విశాఖ జిల్లాలోని అనకాపల్లి డివిజన్ ఉంది. ఇక్కడ మూడు వందల పంచాయతీలకు మూడు వేల దాకా ఉన్న వార్డు మెంబర్లకు ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి.

మరి ఈ ఎన్నికల్లో ఎవరిది గెలుపు అంటే తెలియడంలేదు. అటు అధికార వైసీపీ గట్టిగానే పట్టుపడుతోంది. అనకాపల్లి డివిజన్ లో  44 దాకా పంచాయతీలు ఏకగ్రీవం అయితే అందులో దాదాపుగా అన్నీ కూడా వైసీపీకే దక్కాయి. ఇక మంత్రి సహా ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ శక్తి మేరకు రంగంలోకి దిగిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలను గెలిచి తీరాలి అంటున్నారు.

దీంతో పాటు అర్ధ బలం, అంగబలం కూడా అధికార పార్టీకి ఉండడంతో దూకుడుగా కధ సాగుతోంది. మరో వైపు చూసుకుంటే టీడీపీ చావో రేవో అన్నట్లుగా పోరాడుతోంది. ఈ ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. రూరల్ జిల్లాలో ఇపుడు కనుక గట్టి పడకపోతే రానున్న కాలమంతా ఇబ్బందులు తప్పవని టీడీపీ పెద్దలు ఊహిస్తున్నారు.

ఇంకో వైపు చూసుకుంటే పంచాయతీ ఎన్నికలే మొదటి  మెట్టుగా కూడా ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఆ తరువత ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కూడా గెలుచుకోవచ్చు అని తలపోస్తున్నారు. అయితే టీడీపీ నేతలు చాలా చోట్ల నామినేషన్లకు కూడా మొదట నుంచి జంకుతూ వచ్చారు. మొత్తానికి ఎక్కువగానే నామినేషన్లు దాఖలు అయినా కూడా గెలుపు అవకాశాలు ఎంతవరకూ అంటే చెప్పలేని స్థితి ఉంది. ఏది ఏమైనా తాము గత ఎన్నికల పరాభవాన్ని దాటి ముందుకు సాగుతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక పార్టీ కొత్తగా నియమించిన వారు బాధ్యులు కూడా తన పనితీరుని ఈ ఎన్నికల్లో చూపిస్తే కనుక టీడీపీకి మంచి ఫలితాలే వస్తాయని అంటున్నారు.






పేగుతెంచుకున్న బిడ్డే బరువైందా.. మరీ ఇంత దారుణమా.. పుట్టకముందే బేరం ఎలా పెడతారు?

జగడ్డ : గంటా కెలుకుడుతో టీడీపీకి భారీ షాక్...?

జగన్ లోపలి మనిషి అలా బయటకు ?

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ చిరంజీవి సినిమాపై తేనెటీగల దాడి..!? ప్రాణాలు కోల్పోయిన గుర్రాలు

కాపు వేద‌న‌: ఈ వైసీపీ కాపు నేత గోడు జ‌గ‌న్ ప‌ట్టించుకుంటాడా... న్యాయం జ‌రిగేనా ?

నా భార్య ఆ పని చేయడం వల్లే మేము విడాకులు తీసుకున్నాము




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>