PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bidend066b996-2afb-43da-a1ea-54247dcdb32a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bidend066b996-2afb-43da-a1ea-54247dcdb32a-415x250-IndiaHerald.jpgఅమెరికా కొత్త అధ్యక్షుడు జో బెడైన్‌ పరిపాలన దూకుడుగానే సాగుతోంది. గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ఆయన సరి చేస్తున్నారు. ప్రత్యేకించి కరోనా విషయంలో పాత అధ్యక్షుడు ట్రంప్ మూర్ఖంగా ప్రవర్తించారు. కరోనా కట్టడిపై అంతగా దృష్టి సారించలేదు. ట్రంప్ సర్కారు నిర్లక్ష్యానికి అమెరికా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లక్షల సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల సంఖ్యలో కరోనా కేసులు వచ్చాయి. అయితే కరోనా కట్టడే ప్రథమ లక్ష్యమని ముందే ప్రకటించిన బైడెన్ సర్కారు అందుకు అనుగుణంగానే చర్యలు biden;american samoa;donald trump;january;february;dookuduబైడెన్ తక్కువ వాడు కాదు.. బాగానే కంట్రోల్‌ చేస్తున్నాడు..?బైడెన్ తక్కువ వాడు కాదు.. బాగానే కంట్రోల్‌ చేస్తున్నాడు..?biden;american samoa;donald trump;january;february;dookuduSun, 07 Feb 2021 08:00:00 GMTఅమెరికా కొత్త అధ్యక్షుడు జో బెడైన్‌ పరిపాలన దూకుడుగానే సాగుతోంది. గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ఆయన సరి చేస్తున్నారు. ప్రత్యేకించి కరోనా విషయంలో పాత అధ్యక్షుడు ట్రంప్ మూర్ఖంగా ప్రవర్తించారు. కరోనా కట్టడిపై అంతగా దృష్టి సారించలేదు. ట్రంప్ సర్కారు నిర్లక్ష్యానికి అమెరికా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లక్షల సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల సంఖ్యలో కరోనా కేసులు వచ్చాయి.


అయితే కరోనా కట్టడే ప్రథమ లక్ష్యమని ముందే ప్రకటించిన బైడెన్ సర్కారు అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా కరోనా విలయతాండవాన్ని చవిచూసిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. క్రిస్‌మస్‌, కొత్త సంవత్సరం సెలవుల తర్వాత తారస్థాయికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. జనవరిలో ఒక్కసారిగా కేసులు విజృంభించాయి.


బైడెన్ అధికారంలోకి రాగానే.. కరోనా నిబంధనలను కఠినం చేశారు. బైడెన్ కూడా ప్రజలకు వంది రోజులు మాస్క్ పెట్టుకోవాలని ఛాలెంజ్ విసిరారు.  ప్రజలు కూడా కరోనా నిబంధనల్ని పాటిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వీటి ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. కరోనా లెక్కలు చూస్తే.. జనవరి రెండో వారంలో 2.5 లక్షల రోజువారీ కేసులు నమోదైతే..  ఫిబ్రవరి నాటికి అవి సగటున రోజుకి 1,48,000కు పడిపోయాయి. ఆస్పత్రులకు వచ్చే కరోనా రోగుల  సంఖ్య కూడా తగ్గుతోంది.


అయితే కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. అంతేకాదు.. మరణాలు కూడా ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1.31 లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా 3,534 మంది మరణించారు. ఇప్పటి వరకూ అమెరికాలో 2.5 లక్షలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. నాలుగున్నర లక్షల మంది వరకూ చనిపోయారు. అయితే బైడెన్ హయాంలో కరోనా కట్టడి చర్యలు బాగానే అమలవుతున్నాయి. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి కూడా.




ఐపీఎస్ ఆఫీసర్ కు కూడా తిప్పలు తప్పలేదు.. అందరు షాక్..?

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>