Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/officer-bribe0532f52e-c974-4c58-8adf-1d0d759ea0ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/officer-bribe0532f52e-c974-4c58-8adf-1d0d759ea0ca-415x250-IndiaHerald.jpgఫైలు కదలాలంటే లంచం, పెన్ను పెట్టాలంటే లంచం. ఇలా కొందరు అధికారులకు లంచం తీసుకోవడం అలవాటుగా మారిపోయి ఉంటుంది. అయితే ఆ లంచం తీసుకోవడంలోనూ ఎన్నో టెక్నిక్కులు వాడుతుంటారు. కానీ ఓ అధికారి లంచం తీసుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించడంతో..officer bribe;koti;ganga;suma;suma kanakala;ganges;patti;district;local language;kusuma jagadish;officeలంచం తీసుకుంటూ అధికారి అత్యుత్సాహం.. ఇలా దొరికిపోయిందేంటి..?లంచం తీసుకుంటూ అధికారి అత్యుత్సాహం.. ఇలా దొరికిపోయిందేంటి..?officer bribe;koti;ganga;suma;suma kanakala;ganges;patti;district;local language;kusuma jagadish;officeSun, 07 Feb 2021 12:41:00 GMT
శ్రీకాకుళం జిల్లా, స్థానిక కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. కార్యాలయ అధికారి.. తన గదిలో ఉన్న సీసీ కెమెరా వల్ల అడ్డంగా బుక్కయింది. బహిరంగంగా లంచం తీసుకుంటుండగా ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా కుసుమ కుమారి పనిచేస్తోంది. స్థానికంగా ఓ కర్మాగారం తనిఖీల ధృవీకరణ కోసం అనుమతి ఇచ్చేందుకు ఆ యజమానిని లంచం డిమాండ్ చేసింది. ఆ యజమాని కూడా లంచం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఒకానొక శుభ ముహూర్తాన లంచం సొమ్ము తీసుకు ఆఫీసుకొచ్చాడు. ఆమెకు అందించాడు. అయితే అది తీసుకునే లోపు ఆమెకు ఆఫీసులో సీసీ కెమెరాలున్న సంగతి గుర్తుకు వచ్చింది.

కానీ కెమెరాలు పని చేయడం లేదని అనుకుంది. అదే ధీమాతో కుసుమ కుమారి కెమెరా ముందే లంచం తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఏకంగా సీసీ కెమెరాకే లంచం తీసుకున్న డబ్బు చూపిస్తూ ఎగతాళి చేసింది. కానీ ఆమె దురదృష్టం.. సీసీ కెమెరా పని చేస్తోంది. దీంతో ఆమె లంచగొండ బాగోతం అంతా కెమెరాలో చిక్కింది.

చివరికి ఈ వీడియో కర్మాగారాల డైరెక్టర్‌ దాకా వెళ్ళింది. దీంతో ఆమెపై దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారి కుసుమ కుమారుని సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒకటనుకుంటే ఇంకోటి జరిగిందని ఆమె తెగ బాధపడిపోతోంది. అందుకే ఎక్కడా అత్యుత్సాహం పనికిరాదంటారు. మరి ఈ చిన్న లాజిక్ ఆమె ఎలా మిస్ అయిందో ఏమో. అయినా తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడొకప్పుడు కచ్చితంగా దొరికిపోవాల్సిందే కదా.!

" style="height: 209px;">



నిమ్మగడ్డ ఆదేశాలు కొట్టేసిన హైకోర్ట్... మంత్రి గారికి గుడ్ న్యూస్

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>