PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updatesfb2b6ce8-6fb2-404b-8124-3a092cd9920a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updatesfb2b6ce8-6fb2-404b-8124-3a092cd9920a-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలోనే కటక్ జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం అత్యల్పంగా నమోదైందని, ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నమ్మకం పోతోందని..ఇది ఒక విధంగా జిల్లాకు అవమానకరమైన పరిస్థితి తేవడమేనని కటక్ కలెక్టర్ చాయని... కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. carona vaccine updates;health;cuttack;district;collector;february;war;central government;v;coronavirusకలెక్టర్ వింత ఆదేశం...వ్యాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్...?కలెక్టర్ వింత ఆదేశం...వ్యాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్...?carona vaccine updates;health;cuttack;district;collector;february;war;central government;v;coronavirusSun, 07 Feb 2021 09:00:00 GMTకరోనా వైరస్ కు పలు దేశాల్లోని సంస్థలు టీకాను అభివృద్ధి చేశాయి. మన దేశంలో కూడా కరోనాను అంతం చేసేందుకు టీకాను అభివృద్ధి చేయడం జరిగింది. అందు బాటులోకి కూడా వచ్చింది. ఇప్పటికే వేసే కార్యక్రమం మొదలై శరవేగంగా కొనసాగుతోంది. వాక్సిన్ ను మొదటిగా... కరోనా వార్ లో ఫ్రంట్ లైన్ లో ఉన్న వారికి, అత్యవసర వైద్యం నిమిత్తం, వృద్ధులకు ముందుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి దాకా దాదాపు 50 లక్షల మందికి టీకా ఇవ్వడం జరిగిందని, అలాగే వారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అయినప్పటికీ పలువురు... కోవిడ్-19 వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు , సందేహాలతో వ్యాక్సినేషన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో వ్యాక్సిన్ అభివృద్ధి కాస్త వేగంగా జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యాక... వ్యాక్సిన్ తీసుకున్న కొందరు వ్యక్తులకు రియాక్షన్ వచ్చిందంటూ వార్తలు వినిపించాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లలో దుష్ప్రభావాలు కనిపించాయని వార్తలు వచ్చాయి. తద్వారా వ్యాక్సిన్ పై కొందరికి అభద్రతా భావం ఏర్పడింది.

దీంతో పలువురు హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒడిశాలోని కటక్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన తాజా నిర్ణయం సంచలనంగా మారింది. వ్యాక్సిన్  తీసుకోకపోతే మీ జీతాలు కట్ అంటున్నారు ఆ కలెక్టర్. రిజిస్ట్రేషన్ అయిన తరువాత కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాని హెల్త్ కేర్ వర్కర్లకు, ఫిబ్రవరి 10 వరకు సమయం   ఇస్తున్నామని... ఆలోగా వ్యాక్సిన్ తీసుకోని అంగన్వాడీ వర్కర్లకు జీతాలు నిలిపివేస్తామని, ఇచ్చేది లేదని ఆయన హెచ్చరించారు. వ్యాక్సినేషన్ విషయంపై ఆయన చేసిన తాజా హెచ్చరిక పెద్ద చర్చకు దారి తీసింది.

రాష్ట్రంలోనే కటక్ జిల్లాలో వ్యాక్సినేషన్ శాతం అత్యల్పంగా నమోదైందని, ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల నమ్మకం పోతోందని..ఇది ఒక విధంగా జిల్లాకు అవమానకరమైన పరిస్థితి తేవడమేనని కటక్ కలెక్టర్ చాయని... కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో ఇస్తున్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్లు రెండూ సురక్షితమైనవేనని, కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని... ఒకవేళ వస్తే అంతగా భయపడాల్సిన అవసరం లేదని. చిన్న చికిత్సతో బాగా అయిపోతుందని చెబుతున్నారు.


విజయ్ సేతుపతి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు..!?

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>