MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-flop-heros36fa1269-1e24-43bf-beab-749d0837acff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/tollywood-flop-heros36fa1269-1e24-43bf-beab-749d0837acff-415x250-IndiaHerald.jpgఒక్క హిట్ ప్లీజ్ అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు హీరోలు. వరుస ఫ్లాపులతో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికిప్పుడు ఒక్క హిట్ అందుకోకపోతే ఫ్లాపుల హీరోగా ముద్ర వేసుకునే అవకాశం ఉంది. అభిమానులు కూడా మర్చిపోయే అవకాశం లేదు. అందుకే ఒక్క హిట్ ప్లీజ్ అంటున్నారు. tollywood flop heros;pawan;gopichand;nagarjuna akkineni;akhil akkineni;bhaskar;boyapati srinu;kalyan;kalyan ram;pawan kalyan;ram pothineni;seetha;srinivas;cinema;baba bhaskar;jersey;mla;jaggery;hero;entha manchivaadavuraa;118;agnyaathavaasi;kusuma jagadish;nandamuri taraka rama rao;devadas;pataas;pataas 1;research and analysis wing;gang leader;gabbar singh;leader;v;kavuru srinivas;pattas;hello;misterఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హీరో లో వీళ్ళేఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హీరో లో వీళ్ళేtollywood flop heros;pawan;gopichand;nagarjuna akkineni;akhil akkineni;bhaskar;boyapati srinu;kalyan;kalyan ram;pawan kalyan;ram pothineni;seetha;srinivas;cinema;baba bhaskar;jersey;mla;jaggery;hero;entha manchivaadavuraa;118;agnyaathavaasi;kusuma jagadish;nandamuri taraka rama rao;devadas;pataas;pataas 1;research and analysis wing;gang leader;gabbar singh;leader;v;kavuru srinivas;pattas;hello;misterSun, 07 Feb 2021 12:00:00 GMT
ఒక్క హిట్ ప్లీజ్ అంటున్నారు తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు హీరోలు. వరుస ఫ్లాపులతో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికిప్పుడు ఒక్క హిట్ అందుకోకపోతే ఫ్లాపుల హీరోగా ముద్ర వేసుకునే అవకాశం ఉంది. అభిమానులు కూడా మర్చిపోయే అవకాశం లేదు. అందుకే ఒక్క హిట్ ప్లీజ్ అంటున్నారు.

పవన్ కళ్యాణ్ చివరి సినిమా అజ్ఞాతవాసి డిజాస్టర్ అందుకున్నాడు. అంతకు ముందు వచ్చిన గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు పెద్దగా ఆడలేదు. వరుసగా మూడు ఫ్లాపులతో పవర్ స్టార్ డౌన్ లో ఉన్నాడు. అర్జుంటుగా పవన్ కు పెద్ద హిట్ కావాలి. పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

హీరో నానికి కృష్ణార్జునయుద్ధం, దేవదాస్, గ్యాంగ్ లీడర్ , వి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. జెర్సీ మాత్రమే హిట్ అయ్యింది. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అఖిల్ నటించిన అఖిల్, హలో , మిస్టర్ మజ్ను మూడు సినిమాలు ఆడలేకపోయాయి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ముందుకొస్తున్నాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు. అల్లుడు శ్రీనుతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ.. స్పీడున్నోడు, జయజానకి నాయకా, సాక్ష్యం, కవచం, సీత సినిమాల్లో నటించాడు. అవన్నీ ఫ్లాపులుగా మిగిలాయి. రాక్షసుడు సినిమా మాత్రమే ఏవరేజ్ గా నిలిచింది.

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. 2015లో వచ్చిన పటాస్ తర్వాత వరుస డిజాస్టర్లే. యిజం, నా నువ్వే, ఎమ్మెల్యే సినిమాలు ఆడలేదు. తర్వాత వచ్చిన 118 ఏవరేజ్ గా నిలిచింది. ఎంత మంచివాడవురా డిజాస్టర్ గా నిలిచింది.
సీనియర్ హీరో నాగార్జున కూడా సోగ్గాడే చిన్ని నాయన తర్వాత సరైన హిట్స్ లేవు. అందుకే ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు

బాలకృష్ణకు కూడా వరుస ఫ్లాపులతో గ్రాఫ్  డౌన్ లో నడుస్తుంది. శాతకర్ణి తర్వాత సరైన్ హిట్ లేదు. ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నాడు.

హీరో గోపీచంద్ కూడా లౌక్యం సినిమా తర్వాత సరైన హిట్స్ లేవు. ఏప్రిల్ 2న సీటామార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


టీవీ ఆన్ చేస్తే చాలు ఆ ఫొటో వస్తోంది..

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>