PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0b64a691-cd1e-4ee0-b8ca-42a102d3f582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0b64a691-cd1e-4ee0-b8ca-42a102d3f582-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 21 వరకు ఇంటి నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పెద్దిరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను ఎవరూ నియంత్రించలేరని చెబుతూనే ఆయన తన ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించిన వాదనలు ఒక పక్క జరుగుతున్నాయి. మరో పక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రjagan elections nimmagadda;editor mohan;tiru;jagan;andhra pradesh;district;peddireddy ramachandra reddy;high court;tirupati;cm;court;chief minister;lawyer;minister;husband;good news;sv mohan reddy;reddy;renigunta;good newwzజగడ్డ : పెద్దిరెడ్డికి ఆ విషయంలో హై కోర్ట్ గుడ్ న్యూస్..కానీ ?జగడ్డ : పెద్దిరెడ్డికి ఆ విషయంలో హై కోర్ట్ గుడ్ న్యూస్..కానీ ?jagan elections nimmagadda;editor mohan;tiru;jagan;andhra pradesh;district;peddireddy ramachandra reddy;high court;tirupati;cm;court;chief minister;lawyer;minister;husband;good news;sv mohan reddy;reddy;renigunta;good newwzSun, 07 Feb 2021 11:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 21 వరకు ఇంటి నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పెద్దిరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను ఎవరూ నియంత్రించలేరని చెబుతూనే ఆయన తన ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించిన వాదనలు ఒక పక్క జరుగుతున్నాయి. మరో పక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి బయలు దేరారు. 

ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుపతి దగ్గరలోని రేణిగుంట విమానాశ్రయానికి వస్తున్నారు. ఇప్పుడు సీఎంకు స్వాగతం పలికేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అయితే పెద్దిరెడ్డి ఈనెల 21 వరకు ఇంట్లోనే ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా సరే ఆయన బయటికి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇక మరో పక్క ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున ఆయన న్యాయవాది మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. ఎన్నికల సంఘం తరపున ఆదినారాయణరావు వాదన వినిపిస్తున్నారు. అయితే రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు మాత్రం పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణలో ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హైకోర్టు అనుమతి ఇచ్చిన దాని కంటే ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేణిగుంటకు బయలుదేరి వెళ్లారు. ఇక దీనికి సంబంధించి పూర్తి తీర్పు 12:00 తర్వాత ఇస్తామని హైకోర్టు చెప్పినట్లు తెలుస్తోంది.




జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>