PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/central-external-affairs-minister-said-about-ap-benefits-in-this-year-budget4cf325c8-a7da-44ef-ad15-4dcd386f23d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/central-external-affairs-minister-said-about-ap-benefits-in-this-year-budget4cf325c8-a7da-44ef-ad15-4dcd386f23d6-415x250-IndiaHerald.jpgఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్ ‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రతిపాదించిన కేటాయింపుల విషయమై ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి స్పష్టత లేదన్నది కాదనలేని సత్యం. అయితే ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్‌లో ఏపీకి కలిగే ప్రయోజనాలు రూ.1.14 లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. jai shankar;dharmendra;satya;india;subrahmanyam jaishankar;rbi;telugu;vishakapatnam;bank;parliment;minister;chennai;central government;jaishankarవార్షిక బడ్జెట్ లో ఏపీకి కలిగే ప్రయోజనాలు రూ.1.14 లక్షల కోట్లు - కేంద్ర విదేశాంగ మంత్రివార్షిక బడ్జెట్ లో ఏపీకి కలిగే ప్రయోజనాలు రూ.1.14 లక్షల కోట్లు - కేంద్ర విదేశాంగ మంత్రిjai shankar;dharmendra;satya;india;subrahmanyam jaishankar;rbi;telugu;vishakapatnam;bank;parliment;minister;chennai;central government;jaishankarSun, 07 Feb 2021 22:45:00 GMTఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్ ‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రతిపాదించిన కేటాయింపుల విషయమై ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి స్పష్టత లేదన్నది కాదనలేని సత్యం. అయితే ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్‌లో ఏపీకి కలిగే ప్రయోజనాలు రూ.1.14 లక్షల కోట్లు ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలవుతున్న 14 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదన చేసిందని, దీని వల్ల రూ.1.14 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుందని అన్నారు.






శనివారం ఆయన విజయవాడలో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అమలవుతోన్న ప్రాజెక్టుల్లో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌, పట్టణ నీటిసరఫరా నిర్వహణ మెరుగుదల ప్రాజెక్టు, గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఉన్నాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు కదా? దానిపై స్పందన తెలియజేయమనగా..... ‘ఇది మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైనా ప్రజల సంక్షేమం, ఉపాధి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వివిధ దేశాల నుంచి 2.9 లక్షల మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకువచ్చామన్నారు. నేను వివిధ దేశాల్లో పర్యటించానని, తెలుగువారు లేని దేశాన్ని ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ప్రతిభావంతుల్ని అందిస్తున్న ఈ గడ్డను సందర్శించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని, అది ఈ రోజు నెరవేరిందని జైశంకర్‌ అన్నారు. బడ్జెట్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌... స్పష్టంగా కనిపిస్తోందని జైశంకర్‌ వెల్లడించారు. కోవిడ్-19 సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 11% వృద్ధి సాధించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘డిమాండ్ తిరిగి పుంజుకోవడమే కాదు.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానం ప్రకారం కోవిడ్ అనంతర కాలంలో కొత్త వృద్ధికి అవకాశం ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు.




కృతి శెట్టిని ఇప్పుడే బుక్ చేసుకోండి అంటున్న మెగా స్టార్..!

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>