Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi31213707-2c84-4953-b639-bd9575bf6d00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi31213707-2c84-4953-b639-bd9575bf6d00-415x250-IndiaHerald.jpgకొందరు నటీనటులు కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా హీరోలే అనిపించుకుంటారు. తెరమీద చెప్పే మాటలు.. ధైర్యం కలిగించే మాటలు..సేవా కార్యక్రమాలు కూడా సమాజంలో చేస్తూ తమ ఉత్తమ మనసులను చాటుకుంటారు. ఇందులో టాలీవుడ్ లో చాలా మంది హీరోలు తమ సేవా గుణాన్ని చాలా రకాలుగా చాటుకుంటూ ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా తన తన జాలి గుండెను చాటుకున్నారు. అందుకే తనకు కొండంత ధైర్యం చెప్పిన వ్యక్తి చిరు ఇంటికెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు.chiranjeevi;chiranjeevi;hyderabad;tollywood;cinemaమెగాస్టారుకు అతడు జీవితాంతం రుణపడి ఉన్నాడట.. ఎందుకో తెలుసా?మెగాస్టారుకు అతడు జీవితాంతం రుణపడి ఉన్నాడట.. ఎందుకో తెలుసా?chiranjeevi;chiranjeevi;hyderabad;tollywood;cinemaSun, 07 Feb 2021 11:00:00 GMTటాలీవుడ్ లో చాలా మంది హీరోలు తమ సేవా గుణాన్ని చాలా రకాలుగా చాటుకుంటూ ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా తన తన జాలి గుండెను చాటుకున్నారు. అందుకే తనకు కొండంత ధైర్యం చెప్పిన వ్యక్తి చిరు ఇంటికెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ వ్యక్తి మరెవరో కాదు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు.
రామ్మోహన్ నాయుడు తీవ్ర అనారోగ్యంతో 4 నెలలుగా చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఈ విషయం తెలిసిన చిరు రామ్మోహన్ ఇంటికెళ్లి పరామర్శించి.. కొండంత ధైర్యం చెప్పారు. కాగా రామ్మోహన్ ఆరోగ్యం ప్రస్తుతం కోలుకోవడంతో చిరును మర్చిపోకుండా ఆయన ఇంటికి వెళ్లి మరీ రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో ఎంతో చురుకుగా పాల్గొనేవాడినని రామ్మోహన్ గుర్తు చేశాడు. ఆరోగ్యం బాగులేకపోతే నన్ను చూడటానికి చిరంజీవి హైదరాబాద్ వచ్చాడని.. తనకు ఎంతో ధైర్యం చెప్పారని రామ్మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు రామ్మోహన్ .

వైద్యులు.. చిరంజీవి ధైర్యం వల్లే నేను ఇంత తొందరగా కోలుకున్నానని అభిప్రాయపడ్డారు రామ్మోహన్ నాయుడు.  దీంతో చిరుకూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో చిరు, చెర్రీలు కలిసి నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే ‘లూసీఫర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిరు. కాగా చిరు, చెర్రీలు నటిస్తున్న ఆచార్య సినిమా అతి తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>