PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-now-who-should-we-trust-kapu-leaders-consultation77d62756-4bc9-4dfa-b059-3c109678f5c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-now-who-should-we-trust-kapu-leaders-consultation77d62756-4bc9-4dfa-b059-3c109678f5c3-415x250-IndiaHerald.jpgఆ ద‌శ‌లో కాపులు బ‌ల‌మైన శ‌క్తిగా రాజ‌కీయాల్లో ఎదిగారు. అయితే, రంగా అనంత‌ర ప‌రిణామాల్లో కాపు ఉద్య‌మాలు బ‌ల‌హీన ప‌డ్డాయి. ఎక్క‌డికక్క‌డ క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం పెరిగి.. కాపుల‌ను రాజ‌కీయ శ‌క్తిగా కంటే..కూడా ఓటు బ్యాంకు గానే చూడ‌డం, వాడ‌డం ప్రారంభించారు. దీనికితోడు చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో కాపుల మ‌ధ్య కాపులే చిచ్చు పెట్టుకున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపుల వాణిని వినిపించిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు మంత్రుల‌ను ఎగ‌దోసిన నాయ‌కులు క‌నిపించారు. ఇక‌, జ‌గ‌న్ హ‌యాంలో చిచ్చు pawan jagan chandra babu;bharatiya janata party;indiaherald group;rbi;smart phone;letter;central government;reddy;mantraకాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!pawan jagan chandra babu;bharatiya janata party;indiaherald group;rbi;smart phone;letter;central government;reddy;mantraSun, 07 Feb 2021 11:25:00 GMTఏపీలో ఎటూ కాకుండా పోయిన సామాజిక వ‌ర్గం ఏదైనా ఉంటే.. కాపుల‌నే చెప్పాలి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల్లో బ‌ల‌మైన వ‌ర్గంగా ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు కేంద్రంగా ఉన్న‌కాపులు.. ఒక‌ప్పుడు రాజ‌కీయాల‌ను శాసించారు. ఇప్పుడు కూడా శాసించే స్థాయి లోనే ఉన్న‌ప్ప‌టికీ.. అనూహ్య రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల మ‌ధ్య సాగుతున్న కాపు రాజ‌కీయ ప్ర‌యాణం.. ద‌శ దిశ లేకుండా పోయింద ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి? ఏవిధంగా దిశ‌ను ఏర్పాటు చేసుకోవాల‌నే అంత‌ర్మ‌థ నం కాపు నేత‌ల మ‌ధ్య బ‌లంగా వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు.. వంగ‌వీటి మోహ‌న్ రంగా వంటి బ‌ల‌మైన నాయ‌కుడు కాపుల కోసం నెత్తురు చిందించేందుకు సైతం సిద్ధ‌మంటూ.. రోడ్డెక్కారు. ఆ ద‌శ‌లో కాపులు బ‌ల‌మైన శ‌క్తిగా రాజ‌కీయాల్లో ఎదిగారు. అయితే, రంగా అనంత‌ర ప‌రిణామాల్లో కాపు ఉద్య‌మాలు బ‌ల‌హీన ప‌డ్డాయి. ఎక్క‌డికక్క‌డ క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం పెరిగి.. కాపుల‌ను రాజ‌కీయ శ‌క్తిగా కంటే..కూడా ఓటు బ్యాంకు గానే చూడ‌డం, వాడ‌డం ప్రారంభించారు. దీనికితోడు చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో కాపుల మ‌ధ్య కాపులే చిచ్చు పెట్టుకున్నారు.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపుల వాణిని వినిపించిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు మంత్రుల‌ను ఎగ‌దోసిన నాయ‌కులు క‌నిపించారు.
ఇక‌, జ‌గ‌న్ హ‌యాంలో చిచ్చు లేకున్నా.. ప‌ట్టించుకునే నాథుడు క‌రువ‌య్యారు. ఇక‌, బీజేపీ కి ఇద్ద‌రు కాపు నాయ‌కులు సార‌థులుగా వ్య‌వ‌హ‌రించినా.. పార్టీలోనే కాదు.. క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా కూడా కాపుల‌కు ద‌న్నుగా నిలిచిన ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఇక‌, జ‌న‌సేన రాక‌తో.. కాపుల ఆశ‌లు చిగురించాయ‌ని అనుకున్నా.. ఇటీవ‌ల ప‌రిణామాల త‌ర్వాత పోనీలే..ప‌వ‌న్ మార‌తాడ‌ని భావించినా.. కాపుల ఆశ‌లు ఫ‌లించే సూచ‌న‌లు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు న్న రాజ‌కీయ వేదికపై కాపుల ప్రాధాన్యం ఏంటి?  ఎలా వ్య‌వ‌హ‌రించాలి?  అనే అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. దీనికి అంతు ద‌రీ క‌నిపించ‌డం లేద‌ని సీనియ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది https://www.indiaherald.com/ 


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>