MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayalalitha7a87042a-78d5-4bbe-ab65-2fecee847b6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jayalalitha7a87042a-78d5-4bbe-ab65-2fecee847b6a-415x250-IndiaHerald.jpgజయలలిత ఒకప్పుడు వ్యాంప్ పాత్రలకు చిరునామాగా కొనసాగింది. మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో బీగ్రేడ్ సినిమాలకు ఈమె పెట్టింది పేరుగా మారడంతో ఆమె దాదాపుగా 100 సినిమాలకు పైగా మళయాళంలో నటించింది. ఆ ఇమేజ్ ను కొనసాగిస్తూ ఆమె తెలుగులో కూడ అనేక సినిమాలలో వ్యాంపు పాత్రలను పోషించింది. ‘సత్యాగ్రహం’ ‘శృతిలయలు’ ‘ఇంద్రుడు చంద్రుడు’ ‘ఏప్రిల్ 1 విడుదల’ ‘అప్పుల అప్పారావు’ లాంటి అనేక సినిమాలలో ఈమె వ్యాంపు పాత్రలలో కనిపించింది.ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్న ఈమె ‘గోరంత దీపం’ ‘ముత్యాల ముగ్గు’ ‘రాధాగోపాలం’ లాంటి పాపుjayalalitha;chiranjeevi;deepa;indra;jayalalitha;guntur;telugu;interview;fatherకళాతపస్వి విశ్వనాథ్ తో బంధుత్వం మిస్ అయిన జయలలిత !కళాతపస్వి విశ్వనాథ్ తో బంధుత్వం మిస్ అయిన జయలలిత !jayalalitha;chiranjeevi;deepa;indra;jayalalitha;guntur;telugu;interview;fatherSun, 07 Feb 2021 09:00:00 GMTజయలలిత ఒకప్పుడు వ్యాంప్ పాత్రలకు చిరునామాగా కొనసాగింది. మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో బీగ్రేడ్ సినిమాలకు ఈమె పెట్టింది పేరుగా మారడంతో ఆమె దాదాపుగా 100 సినిమాలకు పైగా మళయాళంలో నటించింది. ఆ ఇమేజ్ ను కొనసాగిస్తూ ఆమె తెలుగులో కూడ అనేక సినిమాలలో వ్యాంపు పాత్రలను పోషించింది. ‘సత్యాగ్రహం’ ‘శృతిలయలు’ ‘ఇంద్రుడు చంద్రుడు’ ‘ఏప్రిల్ 1 విడుదల’ ‘అప్పుల అప్పారావు’ లాంటి అనేక సినిమాలలో ఈమె వ్యాంపు పాత్రలలో కనిపించింది.


ఇండస్ట్రీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్న ఈమె ‘గోరంత దీపం’ ‘ముత్యాల ముగ్గు’ ‘రాధాగోపాలం’ లాంటి పాపులర్ సీరియల్స్ లో నటించింది. అయితే ఆమె గతంలో విశ్వనాథ్ మేనల్లుడుని పెళ్ళి చేసుకునే సందర్భంలో ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆ సంబంధం మిస్ అయిన సందర్భాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆమె గుర్తుకు తెచ్చుకుంది.



బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జయలలిత మంచి క్లాసికల్ డాన్సర్. అప్పట్లో ఆమె గుంటూరులో కళాతపస్వి విశ్వనాథ్ మేనల్లుడు ఇంట్లో అద్దెకు ఉండేదట. ఆయన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే వాడట. ఆరోజులలో జయలలితను విశ్వనాథ్ కు మేనల్లుడుతో పెళ్ళి నిశ్చయం కావడంతో జయలలిత తండ్రి ఆ సంబంధానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని సరిగ్గా నిశ్చితార్థం రోజుకి ఎస్కేప్ అయిపోయాడటదీనితో ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది.


ఆతరువాత జయలలిత పాపులర్ వ్యాంపు ఆర్టిస్టుగా మారిన తరువాత విశ్వనాథ్ ఆమెకు అవకాశాలు ఇచ్చారు కానీ ‘బ్రాహ్మణుల అమ్మాయివి నీవు నీకెందుకు ఇలాంటి వేషాలు’ అంటూ విశ్వనాథ్ డిస్కరైజ్ చేసేవారనీ జయలలిత అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటోంది. అయితే విశ్వనాథ్ మేనల్లుడు విషయంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇలా తనతో విశ్వనాథ్ అని ఉంటారు అని భావిస్తూ ఆ నిశ్చితార్ధానికి విశ్వనాథ్ కూడ వచ్చిన విషయాన్ని జయలలిత గుర్తుకు చేసుకుంది. ఏమైనా విశ్వనాథ్ కుటుంబ సభ్యురాలుగా అయ్యే అవకాశాన్ని జయలలిత కొద్దిలో మిస్ అయింది అనుకోవాలి..




విజయ్ సేతుపతి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు..!?

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంలో త‌ప్పంతా రాష్ట్ర ప్ర‌భుత్వానిదే.. బ‌య‌ట‌ప‌డుతున్న‌ సాక్ష్యాలు..

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - మరి వాట్ నెక్స్ట్?

జగడ్డ: పెద్దిరెడ్డిపై మరింత పెద్ద చర్యకు ప్రయత్నాలు..

అయ్యోపాపం ఏపీ పోలీసులు.. సెలవు దొరికి ఎన్నిరోజులైందో..?

జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>