PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం మీద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బండి సంజయ్ నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి సారించలేదు. ఎక్కువగా హైదరాబాద్ లేకపోతే వరంగల్ లో మాత్రమే పార్టీని బలోపేతం చేయడం మినహా ఆయన ఎక్కడా కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే అభ్యర్థి బలంగbandi sanjay;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;nalgonda;partyబండికి ఈ ప్రధాన లోపం కనపడటంలేదా...?బండికి ఈ ప్రధాన లోపం కనపడటంలేదా...?bandi sanjay;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;nalgonda;partySun, 07 Feb 2021 13:00:00 GMTభారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం మీద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బండి సంజయ్ నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి సారించలేదు. ఎక్కువగా హైదరాబాద్ లేకపోతే వరంగల్ లో మాత్రమే పార్టీని బలోపేతం చేయడం మినహా ఆయన ఎక్కడా కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు. ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే అభ్యర్థి బలంగా ఉన్నారు కాబట్టి గెలిచింది.

కానీ పార్టీ బలంగా ఉండి కాదు. దానికి తోడు సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత ఉంది. అయితే చాలా వరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పోటీ చేయడానికి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా పార్టీకి లేరనే చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి ఏంటి అనేది సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తుంది ఏంటనేది ఇంకా క్లారిటీ  లేదు.

అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నేతను భారతీయ జనతా పార్టీలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ సొంతంగా నేతలను తయారు చేసుకోవడం మానేసి ఇతర పార్టీల నేతల మీద ఆధారపడి ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదని కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల మీద దృష్టిపెట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు రావచ్చని లేకపోతే పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా ఉండదు అని వ్యాఖ్యానిస్తున్నారు.


మా అభ్యర్థికి ఓటేయకపోతే అంతే!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ప‌థ‌కాలు నీరుగారుతున్నా.. ప‌ట్టించుకునేవారేరీ.. !

జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

కాపు వేద‌న‌: ఇప్పుడు ఎవ‌రిని న‌మ్మాలి.. కాపు నేత‌ల స‌మాలోచ‌న‌..!

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>