PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy2a1b81a6-6391-41a2-a742-6bad1a871874-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy2a1b81a6-6391-41a2-a742-6bad1a871874-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు... ఆయన మరో వైఎస్సార్ కావాలనుకుంటున్నాడా.. అయినా అనుకున్నా కాగలడా.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తులు ఆ దిశగానే సాగుతున్నాయా.. వైఎస్సార్ తరహాలోనే ఆయన ప్రజల మద్దతు కూడగట్టాలనుకుంటున్నాడా.. అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా ఆయన అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. పాదయాత్ర వైఎస్సార్ జీవితాన్ని సమూలంగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ దారినే ఎంచుకున్నాడు. అచ్చంపేటలో కాంగ్రెస్ నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్revanth-reddy;modi;kcr;rajeev;ravi anchor;revanth;delhi;hyderabad;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;vegetable market;nallamala forest;reddy;petta;corporate;shaktiరేవంత్ రెడ్డి.. మరో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అవుతాడా..?రేవంత్ రెడ్డి.. మరో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అవుతాడా..?revanth-reddy;modi;kcr;rajeev;ravi anchor;revanth;delhi;hyderabad;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;vegetable market;nallamala forest;reddy;petta;corporate;shaktiSun, 07 Feb 2021 23:00:00 GMTరేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు... ఆయన మరో వైఎస్సార్ కావాలనుకుంటున్నాడా.. అయినా అనుకున్నా కాగలడా.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తులు ఆ దిశగానే సాగుతున్నాయా.. వైఎస్సార్ తరహాలోనే ఆయన ప్రజల మద్దతు కూడగట్టాలనుకుంటున్నాడా.. అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా ఆయన అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. పాదయాత్ర వైఎస్సార్ జీవితాన్ని సమూలంగా మార్చిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ దారినే ఎంచుకున్నాడు. అచ్చంపేటలో కాంగ్రెస్ నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షను ఉన్నట్టుండి పాదయాత్రగా మార్చేశాడు. అచ్చంపేట సభలో రేవంత్ రెడ్డి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరాడు రేవంత్ రెడ్డి. రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు పాదయాత్రగా మార్చుకున్న రేవంత్ రెడ్డి... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే శక్తి నల్లమల బిడ్డనైన నాకు ఈ ప్రాంత ప్రజలిచ్చారన్నారు.


రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని మల్లు రవి, సీతక్క వంటి నేతలు కోరగా.. మల్లు రవి, సీతక్క ప్రతిపాదనను ఆమోదిస్తూ పెద్ద ఎత్తున సభలో పాల్గొన్న ప్రజలు నినాదాలు చేశారు. రైతులు కష్టాలు ఇట్ల ఉంటే కారెక్కి ఇంటికి ఎట్ల పోతానన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. కోట్లు సంపాదిద్దామని రైతు వ్యవసాయం చేయడని..  బీరువాలల్ల బంగారం నింపడానికి వ్యవసాయం చేయడని రేవంత్ అన్నారు. రూ.15 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేసిన మోడీ.. కొత్త చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు , మార్కెట్ యార్డులు లేవు, మద్ధతు ధర లేకుండా చేశాడన్నారు.


రైతుల జీవితాలను అదానీ, అంబానీలకు మోడీ అమ్ముతుంటే.. దీనిని కేసీఆర్ సమర్ధిస్తున్నాడని రేవంత్ మండిపడ్డారు. పోయిన నెల బందులో పాల్గొన్న కేసీఆర్ ఢిల్లీ పోయి వంగి వంగి దంణ్ణాలు పెట్టొచ్చాడని.. మోడీ, కేసీఆర్ తోడు దొంగలని రేవంత్ అంటున్నారు. మరి ఈ పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఏమేరకు పెరుగుతుందో చూడాలి.




టెన్త్ పాసయితే గవర్నమెంట్ జాబ్ !

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>