PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/saggu-rice474b725e-3650-4722-834d-d0781ea8c475-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/saggu-rice474b725e-3650-4722-834d-d0781ea8c475-415x250-IndiaHerald.jpgసగ్గు బియ్యంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. దీంతో ఈ ఆహారానికి ప్రాధాన్యత ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి సగ్గు బియ్యం ఎంతో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్-బీ వల్ల శరీరానికి ఎంతో మేల చేస్తుంది. గర్భిణులు, శిశువులకు సగ్గు బియ్యం ఎంతో శ్రేయస్కరం. saggu rice;kerala;andhra pradesh;vitamin;aquaసగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా.. !సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా.. !saggu rice;kerala;andhra pradesh;vitamin;aquaSun, 07 Feb 2021 06:00:00 GMT
సగ్గు బియ్యంలో రసాయనాలు, తీపి పదార్థాలు ఎక్కువగా ఉండవు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలు ధృడంగా ఉండేందుకు మేలు చేసే కాల్షియం, విటమిన్-కే వంటివి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి.. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.

అయితే సగ్గు బియ్యంను కర్ర పెండలం అనే దుంపతో తయారు చేస్తారు. భూమిలో నుంచి బయటకు తీసిన కర్ర పెండలం దుంపలను 24 గంటల్లో సగ్గు బియ్యం కేంద్రానికి చేరవేయవలిసి ఉంటుంది.  ఆ దుంపలను నీటి తో బాగా శుభ్రంచేసి దానిపై ఉన్న  తొక్కను యంత్రాలతో వేరుచేస్తారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళ తో శుభ్రం  చేస్తారు. తర్వాత ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. అలా  వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళ్లేలా ఏర్పాటుచేస్తారు . ఈ క్రమం లో, పాలలోని చిక్కని పదార్థం ఒక ముద్దలా ఉంటుంది. దాని నుండే  సగ్గు బియ్యం తయారు అవుతుంది.

ఇక ఈ పిండి వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి చేరుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదలడం వలన ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జలజలా రాలి పడుతుంటుంది .అలా పడినప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి తరువాత వాటిని ఎండలో ఆర బెడతారు. 100 కిలోల సగ్గుబియ్యం కావాలంటే  సుమారు 500 కిలోల దుంపల ను వాడాలిసి ఉంటుంది. ఈ విధానంలో సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ కేరళ, తమిళనాడు, లో తయారి మిల్లులు ఉన్నాయి.


జగడ్డ: నిమ్మగడ్డ దూకుడు.. తట్టుకోలేకపోతున్న వైసీపీ నేతలు..?

గుడ్‌న్యూస్‌ : విశాఖ ఉక్కుపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>