PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections8b464f81-8b50-4f14-8eb0-b1bcc5f0b563-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections8b464f81-8b50-4f14-8eb0-b1bcc5f0b563-415x250-IndiaHerald.jpgమనం నియమించబడింది ప్రజల సేవ కోసం... ఎవరి ఆర్డర్స్ నో అమలు చేయడం కోసం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఎస్ఈసి నేరుగా మంత్రి పెద్దిరెడ్డి పైనే చర్యలు తీసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ విషయంపై ఎస్ఈసి వైఖరి పట్ల న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది ప్రభుత్వం.jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;gautham new;gautham;andhra pradesh;panchayati;court;february;minister;governor;letter;service;chief commissioner of elections;reddy;party;nirbayaజగడ్డ: పెద్ది రెడ్డి విషయంలో నిమ్మగడ్డ ఆదేశాలను డీజీపీ అమలు చేయకపోతే...?జగడ్డ: పెద్ది రెడ్డి విషయంలో నిమ్మగడ్డ ఆదేశాలను డీజీపీ అమలు చేయకపోతే...?jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;gautham new;gautham;andhra pradesh;panchayati;court;february;minister;governor;letter;service;chief commissioner of elections;reddy;party;nirbayaSun, 07 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వైరం కొనసాగుతోంది. అధికార పార్టీ వర్సెస్ ఎస్ఈసి నిమ్మగడ్డ ఆధిపత్య పోరులో ఎవరూ వెనక్కి తగ్గను అంటున్నారు. తాజాగా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు బయటకు రాకూడదు అని ఇంట్లోనే ఉంచాలని, ఆయన కనీసం మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకూడదని.. మాట్లాడనివ్వద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు.

ఓటర్లు ఎవరి ప్రోద్బలంతోనో కాకుండా... సొంతంగా ఆలోచించి నిర్భయంగా తమకు నచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించేందుకు ఈ చర్యలు అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ దుమారం రేపుతోంది. అయితే మొదట...ఎస్ఈసి ఏకగ్రీవాలపై ఆర్డర్స్ జారీ చేసిన తర్వాత...ఏకగ్రీవాలపై మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఈసిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్వార్థపూరిత మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని మంత్రి పెద్దిరెడ్డి ముందుగా హెచ్చరించారు.

మనం నియమించబడింది ప్రజల సేవ కోసం... ఎవరి ఆర్డర్స్ నో అమలు చేయడం కోసం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఎస్ఈసి నేరుగా మంత్రి పెద్దిరెడ్డి పైనే చర్యలు తీసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ విషయంపై ఎస్ఈసి వైఖరి పట్ల న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ క్రమంలో పెద్దిరెడ్డి మీద డీజీపీ చర్యలు తీసుకోకపోతే తర్వాత ఏం జరుగుతుంది.... ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుంది అన్న అంశంపై చర్చ మొదలైంది. ఒకవేళ డీజీపీ పెద్దిరెడ్డి పై యాక్షన్ తీసుకోకపోతే... ఈసారి నిమ్మగడ్డ నేరుగా గవర్నర్ కు లేఖ రాస్తారేమో అంటున్నారు.మరి ఏమి జరగనుంది రానున్న రోజుల్లో చూడాలి.


జగడ్డ : గుండా రాజకీయాలు మానండి .?

టార్గెట్ బాబు: గ‌ంటా వ్యూహం ఇదే..!

పంచాయతీ సిత్రాలు: కోడలు స్థానంలో అత్త సర్పంచ్..

వైసీపీలో ఆ యువ ఎంపీకి అంత ప్ర‌యార్టీ వెన‌క ఇంత క‌థ ఉందా ?

జగడ్డ : ఏపీలో మరో రాజ్యాంగ సంక్షోభం...?

అదీ అసలు సంగతి.. విశాఖ స్టీల్‌ ప్రైవేటు వెనుక అసలు రహస్యం..?

KGF 2 బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>