EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pv-narasimharao0738fcc2-e5c1-4eee-b90c-58f17ad77f62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/pv-narasimharao0738fcc2-e5c1-4eee-b90c-58f17ad77f62-415x250-IndiaHerald.jpgతెలుగు జాతి ఠీవీ పీవీకి భార‌త‌ర‌త్నం ఇవ్వాల‌నే డిమాండ్ ఎన్నాళ్లుగానో వినిపిస్తోంది. దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసి... ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించ‌డ‌మే కాదు.. స‌ర‌ళీక‌ర‌ణ ఆర్థిక విధానాల‌తో దేశాన్ని ప్ర‌గ‌తి బాట ప‌ట్టించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. కాంగ్రెస్ పార్టీలోని గాంధీ కుటుంబంతో స్వ‌త‌హాగా ఆయ‌న‌కున్న వైరుధ్యంతోనే బతికుండగానే ఆయ‌న చుట్టూ కొన్ని కేసులు ముసిరాయి. ఆయ‌న‌కు రావాల్సినంత గుర్తింపు రాలేద‌న్న‌ది నిర్వివాదాంశం. అయితే కొన్నాళ్లుగా పీవీకి భార‌త‌ర‌త్నం ప్ర‌క‌టించాల‌ని టీఆర్pv;ktr;narendra modi;mohandas karamchand gandhi;congress;mp;minister;letter;central government;partyతెలుగు ఠీవీ పీవీకి భార‌త‌ర‌త్న ద‌క్కేనా... మ‌ళ్లీ పార్ల‌మెంటులో చ‌ర్చ‌....తెలుగు ఠీవీ పీవీకి భార‌త‌ర‌త్న ద‌క్కేనా... మ‌ళ్లీ పార్ల‌మెంటులో చ‌ర్చ‌....pv;ktr;narendra modi;mohandas karamchand gandhi;congress;mp;minister;letter;central government;partySat, 06 Feb 2021 09:43:49 GMTకాంగ్రెస్ పార్టీలోని గాంధీ కుటుంబంతో స్వ‌త‌హాగా ఆయ‌న‌కున్న వైరుధ్యంతోనే బతికుండగానే ఆయ‌న చుట్టూ కొన్ని కేసులు ముసిరాయి. ఆయ‌న‌కు రావాల్సినంత గుర్తింపు రాలేద‌న్న‌ది నిర్వివాదాంశం. అయితే కొన్నాళ్లుగా పీవీకి భార‌త‌ర‌త్నం ప్ర‌క‌టించాల‌ని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కేంద్రంపై  ఒత్తిడి తెస్తోంది. దీనికి ప్ర‌ధాన‌మంత్రి మోదీ సానుకూలంగా స్పందించిన‌ట్లుగా కూడా ఆ పార్టీ ఎంపీలు చెప్పుకొచ్చారు.

 అయితే ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆ మ‌హాత్ముడికి భార‌త ర‌త్న ప్ర‌క‌టిస్తే తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పీవీ అభిమానులు సంతోషిస్తార‌ని టీఆర్ ఎస్ ఎంపీలు చెబుతున్నారు. తాజాగా పార్ల‌మెంటులో టీఆర్ ఎస్ ఎంపీలు పీవీకి భార‌త ర‌త్న విష‌యాన్ని లేవనెత్తారు. టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు బండా ప్ర‌కాష్ మాజీ ప్ర‌ధాని పీవీ న‌రసింహారావు కి భార‌త ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.  రాజ్య‌స‌భ‌లో రాష్ర్ట‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎంపీ బండా ప్ర‌కాశ్‌ మాట్లాడుతూ, పివి శ‌త జ‌యంతి ఉత్స‌వాలు జ‌రుకుంటున్న వేళ ఆయ‌న సేవ‌ల‌కు గుర్తుగా భార‌తర‌త్న ఇవ్వాల‌ని కోరారు.


అలాగే హైద‌రాబాద్ లోని సెంట్ర‌ల్ వ‌ర్శిటీకి, ఓ ర‌హ‌దారికి ఆయ‌న పేరును పెట్టాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.. విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను నెర‌వేర్చాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌లో టీకా ప‌రీక్ష‌, ధ్రువీక‌ర‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. ఈ విష‌యంపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశార‌ని గుర్తు చేశారు. ఉప రాష్ర్ట‌ప‌తి వెంక‌య్య నాయుడు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లార‌ని ఎంపీ తెలిపారు. ‌టీకా ప‌రీక్ష కేంద్రం ఏర్పాటుపై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌న్నారు.




డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>