PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steel-plant6152d527-5784-4f79-a4fa-5001f8f5c7b8-415x250-IndiaHerald.jpgకేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నీతీ ఆయోగ్ సిఫారసుల మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతీ ఆయోగ్ సూచించిందని, ఆ ప్రకారమే తాము ముందుకు వెళతామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తమకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారుvizag steel plant;visakhapatnam;bharatiya janata party;anurag thakur;andhra pradesh;telangana;vishakapatnam;buggana rajendranath reddy;parliment;minister;central government;reddyవారి సూచనల మేరకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' ప్రైవేటీకరణ - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రివారి సూచనల మేరకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' ప్రైవేటీకరణ - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిvizag steel plant;visakhapatnam;bharatiya janata party;anurag thakur;andhra pradesh;telangana;vishakapatnam;buggana rajendranath reddy;parliment;minister;central government;reddySat, 06 Feb 2021 20:50:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగర తీరాన గల 26 వేల ఎకరాల అతిపెద్ద సువిశాల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ ప్రతిపక్షాలు, కార్మిక మరియు ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. తెలుగు ప్రజల పోరాటలతో, 32 మంది అమరవీరుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఇప్పుడు ప్రయివేట్ పరం చేయడం దారుణమని మండిపడుతున్నాయి. ఆర్థిక పరమైన నష్టాలు ఉన్నాయనే సాకుతో స్టీల్ ప్లాంట్‌ను ఇప్పుడు ఇలా ప్రైవేట్ సంస్థలకు దారాధత్తం చేయడానికి కేంద్రం సిద్ధమయ్యిందని దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై తాజాగా స్పందించారు.



కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నీతీ ఆయోగ్ సిఫారసుల మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతీ ఆయోగ్ సూచించిందని, ఆ ప్రకారమే తాము ముందుకు వెళతామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తమకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.ఇక అలాగే ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చేసిన బడ్జెట్ కేటాయింపులపైన కూడా ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం జరగలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని సూచించారు. ఇక అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఆర్థిక నిధులపై తమను మూడుసార్లు కలిశారని తెలిపారు. ఒప్పందం ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకు తాము నిధులు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు.


ఇప్పటి వరకు పెద్దిరెడ్డి... ఇప్పుడు ఆయన కొడుకు... నిమ్మగడ్గాడను ఆడుకున్నారుగా...

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>