PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mps-targets-nimmagadda-ramesh-and-chandrababu74d0964d-7493-455c-8c18-bfd09d9e0659-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp-mps-targets-nimmagadda-ramesh-and-chandrababu74d0964d-7493-455c-8c18-bfd09d9e0659-415x250-IndiaHerald.jpg25కు 25 ఎంపీలు ఇవ్వండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చిపెడతా...ఇది జగన్ 2019 ఎన్నికల ముందు మాట్లాడిన మాట. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా జగన్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడారు. ఇక జగన్ పోరాటానికి ఫలితంగా 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు 25కు 22 మంది ఎంపీలని ఇచ్చారు. ఇక ఇన్ని ఎంపీలు ఇచ్చాక జగన్ ప్రత్యేక హోదా తెచ్చేస్తారని ప్రజలు అనుకున్నారు. ysrcp;cbn;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;2019;kadapa;vishakapatnam;media;tdp;central government;ycp;trainవైసీపీ ఎంపీల పోరాటం ఫలించింది...అదొక్కటే సమస్య..వైసీపీ ఎంపీల పోరాటం ఫలించింది...అదొక్కటే సమస్య..ysrcp;cbn;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;2019;kadapa;vishakapatnam;media;tdp;central government;ycp;trainSat, 06 Feb 2021 01:00:00 GMTజగన్ 2019 ఎన్నికల ముందు మాట్లాడిన మాట. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా జగన్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడారు. ఇక జగన్ పోరాటానికి ఫలితంగా 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు 25కు 22 మంది ఎంపీలని ఇచ్చారు. ఇక ఇన్ని ఎంపీలు ఇచ్చాక జగన్ ప్రత్యేక హోదా తెచ్చేస్తారని ప్రజలు అనుకున్నారు.

కానీ మొదట్లోనే ప్రత్యేక హోదాపై జగన్ చేతులు ఎత్తేశారు. కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో హోదా రాదని జగన్ చెప్పేశారు. కాకపోతే కేంద్రాన్ని ప్లీజ్, ప్లీజ్ అని అడగాలని మాట్లాడారు. ఇక అప్పటినుంచి జగన్, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా హోదాపై కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి వస్తున్నట్లే కనబడుతోంది. అయితే జగన్ గురించి కాసేపు పక్కనబెడితే, ఆయనకు సంబంధించిన 22 మంది ఎంపీలు పార్లమెంట్‌లో ఏం చేస్తున్నారు? అంటే సమాధానం చెప్పడం కష్టమే.

సరే హోదా గురించి కాసేపు వదిలేసినా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైల్వే జోన్, మెట్రో ట్రైన్, కడప స్టీల్ ప్లాంట్, ఇంకా పోర్టులు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రానికి కేంద్రం చాలానే ఇవ్వాలి. కానీ వీటి విషయంలో వైసీపీ ఎంపీలు చేసే పోరాటం పెద్దగా ఏమి లేదని తెలుస్తోంది. గతంలో టీడీపీ ఎంపీలు ఎన్నికల ముందు హడావిడి చేసి, రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమి లేదు. ఇప్పుడు వైసీపీ ఎంపీలు కూడా అదే చేస్తున్నారు.

పైగా ఢిల్లీలో ఉన్న ఎంపీలు...రాష్ట్రంలో ఎలక్షన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని విమర్శించే పనిలో ఉన్నారు. బాలశౌరి లాంటి వారు ఢిల్లీ మీడియా సమావేశంలో విశాఖ ఉక్కు కర్మాగారం గురించి ఏం మాట్లాడవద్దని సహచర ఎంపీలకు సలహాలు ఇస్తున్నారు. చంద్రబాబునే తిట్టాలని టార్గెట్ ఇస్తున్నారు. నిమ్మగడ్డ, చంద్రబాబులని తిట్టడంలో ఎంపీల పోరాటం ఫలిస్తుంది గానీ, రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాత్రం ఎలాంటి పోరాటం లేదు... ఫలితం లేదు.  




అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>