Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgరాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ ఉపకరణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే చివరి గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించిందని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020, -21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలkoppula eswar;hyderabad;india;district;chief minister;2020;february;minister;application;eshwarదివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితం :మంత్రి కొప్పుల ఈశ్వర్...!!!దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితం :మంత్రి కొప్పుల ఈశ్వర్...!!!koppula eswar;hyderabad;india;district;chief minister;2020;february;minister;application;eshwarSat, 06 Feb 2021 00:08:27 GMT
దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితం :మంత్రి కొప్పుల ఈశ్వర్...!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.  దరఖాస్తు చేసుకునే చివరి గడువు ఫిబ్రవరి 15వ తేదీ ఆన్‌లైన్‌లో మాత్రమే ధరఖాస్తు చేయాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ ఉపకరణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే చివరి గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించిందని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020, -21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13వేల 195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని కొప్పుల పేర్కొన్నారు.ఈ మేరకు 20కోట్ల 41 లక్షల రూపాయల వ్యయంతో త్రిచక్ర వాహనాలు, వీల్‌ఛైర్స్, లాప్‌టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

90 వేల రూపాయల విలువ చేసే900 రిట్రోఫెట్టెడ్ మోటారు వాహనాలు కూడా అవసరమైన వారికి అందజేస్తామన్నారు. ఉపకరణాల కోసం ఈనెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 6 వరవ దరఖాస్తు చేసుకోవలసి ఉండగా, పలువురి విజ్ఞప్తి మేరకు చివరి తేదీని ఈనెల 15వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి వివరించారు. www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.


ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 




తెలంగాణ బ్రాండ్‌ పేరుతో మాంసం విక్రయాలు ప్రారంభించనున్నట్లు : తలసాని శ్రీనివాస్

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>