MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothinenide66bdbd-1a3a-42b3-80d9-f24d9314bb56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothinenide66bdbd-1a3a-42b3-80d9-f24d9314bb56-415x250-IndiaHerald.jpgఇటీవలే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్.. ఈ ఏడాది రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. రామ్ తో గతంలో నేను, శైలజ, ఉన్నది ఒకటే జిందగి వంటి కమర్షియల్ హిట్ చిత్రాలను తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కవల సోదరులుగా రామ్ చేసిన డ్యూయల్ రోల్‌కు ప్రశంసలు లభించాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రీతిలో కలెక్ట్ చేయలేకపోయింది ఆ సినిమా. అందుకే సంక్రాంతి విన్నర్ అనే ట్యాగ్ రెడ్ మూవీకి లభించలేదు.ram pothineni;venkatesh;shiva;kranthi;kranti;puri jagannadh;ram pothineni;shankar;surender reddy;tiru;makar sakranti;kudumu;cinema;sankranthi;tirupati;twitter;love;episode;ismart shankar;director;lord siva;winner;winner1;venky kudumula;reddy;bobby;mass;kishore tirumala;redభక్తుడిగా ఆకట్టుకుంటున్న రామ్ పోతినేని లేటెస్ట్ లుక్.. దేనికోసమో తెలుసా..??భక్తుడిగా ఆకట్టుకుంటున్న రామ్ పోతినేని లేటెస్ట్ లుక్.. దేనికోసమో తెలుసా..??ram pothineni;venkatesh;shiva;kranthi;kranti;puri jagannadh;ram pothineni;shankar;surender reddy;tiru;makar sakranti;kudumu;cinema;sankranthi;tirupati;twitter;love;episode;ismart shankar;director;lord siva;winner;winner1;venky kudumula;reddy;bobby;mass;kishore tirumala;redSat, 06 Feb 2021 17:00:00 GMTడైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్.. ఈ ఏడాది రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. రామ్ తో గతంలో నేను, శైలజ, ఉన్నది ఒకటే జిందగి వంటి కమర్షియల్ హిట్ చిత్రాలను తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  కవల సోదరులుగా రామ్ చేసిన డ్యూయల్ రోల్‌కు ప్రశంసలు లభించాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రీతిలో కలెక్ట్ చేయలేకపోయింది ఆ సినిమా. అందుకే సంక్రాంతి విన్నర్ అనే ట్యాగ్ రెడ్ మూవీకి లభించలేదు.

 ఒక క్లాస్‌, మరొక మాస్ క్యారెక్టర్ చేసినప్పటికీ, మాస్ క్యారెక్టర్‌కు కిక్కిచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం మైనస్‌గా మారింది. ఉన్న ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కవల సోదరుల మధ్యే ఉండటం ఆడియెన్స్‌కు కిక్కునివ్వలేదు.ఆ విషయం అలా ఉంచితే, 'రెడ్' తర్వాత ఇంత దాకా రామ్ మరో సినిమాని స్టార్ట్ చేయలేదు.డైరెక్టర్‌తో వర్క్ చేయబోతున్నాడో కూడా వెల్లడి కాలేదు. సురేందర్ రెడ్డి, బాబీ, వెంకీ కుడుముల పేర్లు రంగంలోకి వచ్చాయి కానీ, ఏదీ ఫైనల్ కాలేదు.ఉన్నట్లుండి రామ్ భక్తి మార్గంలోకి వెళ్లాడు. శివ దీక్ష పుచ్చుకున్నాడు. శనివారం పసుపు రంగు చొక్కా, లుంగీ, కండువా ధరించిన ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు.
 
నుదుటిన శివ నామాలు, కళ్లకు బ్లాక్ గాగుల్స్‌, చేతిలో సెల్ ఫోన్‌తో కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. ఇక్కడ కూడా తన స్టైల్‌ను అతను మిస్సవలేదు!ఆ ఫొటోతో పాటు, "Om Namah Shivaya! Small break.. I'll be back!! Love.. #RAPO (ఓం నమశ్శివాయ.. చిన్న విరామం.. తిరిగొస్తాను! ప్రేమతో..)" అని రాసుకొచ్చాడు..ప్రస్తుతం భక్తుడి గెటప్ లో ఉన్న రామ్ ఫోటో ఇప్పటికే వైరల్ గా మారి అభిమానులతో పాటు, నెటీజన్స్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది..మరి రామ్ ఎన్ని రోజులు ఆ దీక్షలో ఉంటాడో, ఎప్పుడు తిరిగి కెమెరా ముందుకు వస్తాడో అనేది తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే...!!
" style="height: 605px;">







Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>