PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babu9f15f579-6956-4f04-889c-5bdc7a5a17b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babu9f15f579-6956-4f04-889c-5bdc7a5a17b5-415x250-IndiaHerald.jpgఅనూహ్యంగా ఇప్పుడు టీడీపీ పుంజుకున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. అనంత‌పురం అర్బ‌న్‌లో ప్ర‌భాక‌ర్ చౌద‌రి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి ఈయ‌న ఓడిపోయినా.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ.. పార్టీకి చేరువగానే ఉన్నారు. ఇక‌, అనంత‌పురం పార్ల‌మెంటు ప‌రిధిలో జేసీ త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్‌రెడ్డి కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవ‌ల మంత్రి కొడాలి నానిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై ప్ర‌భుత్వం దాడికి దిగుతోంద‌ని tdp chandrababu;2019;district;mla;minister;letter;tdp;local language;ycp;josh;party;mantraటీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?tdp chandrababu;2019;district;mla;minister;letter;tdp;local language;ycp;josh;party;mantraSat, 06 Feb 2021 08:38:00 GMTఅనంత‌పురం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌.  పార్టీకి ఇక్క‌డ బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అదేస‌మ‌యంలో నా య‌కులు కూడా ఉన్నారు. 2014లో భారీ సంఖ్య‌లో ఇక్క‌డ టీడీపీ నేత‌లు విజ‌యంసాధించారు. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రి ప‌ద‌వులు కూడా పొందారు. అయితే.. గ‌త 2019 ఎన్నిక ‌ల్లో.. వైసీపీ ధాటికి ఇక్క‌డ టీడీపీ కుదేలైంది. కీల‌క నాయ‌కులు ఓడిపోయారు. ముఖ్యంగా గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ ‌మ‌ని భావించిన సీనియ‌ర్ నాయ‌కుల‌ వార‌సులు కూడా ఓట‌మి బాట ప‌ట్టారు. దీంతో జిల్లా పార్టీలో ఒక విధ‌మైన శూన్య‌త ఆవ‌రించింది.

ఫ‌లితంగా నాయ‌కులు ఎవ‌రికివారే.. అన్న‌ట్టుగా త‌యార‌య్యారు. ఇక‌, అనంత‌పురం పార్ల‌మెంటు ప‌రిధిలో చ‌క్రం తిప్పుతున్న‌ జేసీ కుటుంబంపై ప్ర‌భుత్వం వ‌రుస కేసులు న‌మోదు చేయ‌డం మ‌రింత క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ప‌రిణామాల‌తో పార్టీలో కీల‌క నేత‌లు సైతం మౌనం పాటిస్తున్నారు. దీంతో గ‌డిచిన ఏడా దిన్న‌ర‌గా జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు టీడీపీ పుంజుకున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. అనంత‌పురం అర్బ‌న్‌లో ప్ర‌భాక‌ర్ చౌద‌రి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి ఈయ‌న ఓడిపోయినా.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ.. పార్టీకి చేరువగానే ఉన్నారు.

ఇక‌, అనంత‌పురం పార్ల‌మెంటు ప‌రిధిలో జేసీ త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్‌రెడ్డి కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవ‌ల మంత్రి కొడాలి నానిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై ప్ర‌భుత్వం దాడికి దిగుతోంద‌ని వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో పార్టీలో జోష్ వ‌చ్చింద‌నే చెప్పాలి. ఇక‌, ప‌రిటాల కుటుంబం కూడా యాక్టివ్ అయింది. ప‌రిటాల శ్రీరాం.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉంటూ.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అదేస‌మ‌యంలో క‌ల్యాణ‌దుర్గంలో ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లుతెలుసుకుంటున్నారు.

ఇక‌, హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య కూడా త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డం.. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌డం వంటివి చేస్తున్నారు.  మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి.. త‌దిత‌రు లు కూడా యాక్టివ్ అయ్యారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌కు కూడా నాయ‌కులు పోటెత్తారు. మొన్న‌టి వ‌ర‌కు వివిధ ప‌నుల‌తో వీసీని ఎగ్గొట్టిన నాయ‌కులు కూడా ఖ‌చ్చితంగా బాబు వీసీ స‌మ‌యానికి హాజ‌ర‌య్యారు. మ‌రి ఇదంతా ఎందుకు జ‌రుగుతోంది?  ఒక్క‌సారిగా ఎందుకు నాయ‌కులు యాక్టివ్ అయ్యారు? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జం.

అనంత‌పురం టీడీపీ ప‌రిణామాలు ఒక్క‌సారిగా మార‌డానికి రెండు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒకటి.. స్థానిక ఎన్నిక‌లు ఉండ‌డం. రెండు తాము సైలెంట్‌గా ఉంటే వైసీపీ దూకుడు మ‌రింత పెరిగి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అడ్ర‌స్ కూడా ద‌క్క‌డ‌నే ఆలోచ‌న కావొచ్చు. ఏదేమైనా.. ప్ర‌స్తుతం.. అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిరాబోయే రోజుల్లో మ‌రింత పుంజుకుంటుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి బాబు వ్యూహం ఫ‌లించింద‌ని.. వైసీపీపై దాడి.. ప్ర‌భుత్వంపై ఆయ‌న చేస్తున్న య‌ద్ధంతో టీడీపీ నేత‌లు పుంజుకున్నార‌ని అంటున్నారు.  


డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన జబర్దస్త్ బ్యూటీ.. అభిమానులు షాక్..?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

రచ్చకెక్కిన క్రాక్ వివాదం...నిర్మాత మీద గోపీచంద్ ఫిర్యాదు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>