PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ కూడా రానుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నించాలి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. దీంతో టీడీపీ నాయ‌కుల‌కు ఛా న్స్ ఇచ్చిన‌ట్టు అయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ ఎంపీల‌ను, సీఎం జ‌గ‌న్‌ను కూడా టీడీపీ నాయ‌కులు ఏకేస్తున్నారు. ఇంత మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నtdp ysrcp;modi;patti;andhra pradesh;రాజీనామా;vishakapatnam;letter;tdp;central government;ycp;partyవైసీపీ టీడీపీకి ఏం ఛాన్స్ ఇచ్చిందిలే ? భ‌లే దొరికేశారే ?వైసీపీ టీడీపీకి ఏం ఛాన్స్ ఇచ్చిందిలే ? భ‌లే దొరికేశారే ?tdp ysrcp;modi;patti;andhra pradesh;రాజీనామా;vishakapatnam;letter;tdp;central government;ycp;partySat, 06 Feb 2021 15:52:14 GMTఅధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య మ‌రో కొత్త ర‌గ‌డ ప్రారంభ‌మైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ.. ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు చిక్కింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో అప్ప‌టి అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్ర‌బాబు వైఖ‌రిని.. వైసీపీ తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టింది. బాబు వైఖ‌రి కార‌ణంగానే ఏపీ ప్ర‌జ‌లకు అన్యాయం జ‌రిగింద‌ని సాక్షాత్తూ అప్ప‌టి విప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ ఆరోపించారు. అడుగ‌డుగునా టార్గెట్ చేశారు.

దీనికి చంద్ర‌బాబు, ఆ పార్టీ నాయ‌కులు కౌంట‌ర్లు ఇచ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది. ప్ర‌త్యేక‌హోదా విష యంలో ఎంపీలంద‌రూ రాజీనామా చేయాల‌ని కూడా జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. అయితే.. చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్యే వైసీపీకి ఎదురైంది. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని  ప్రైవేటీక‌రించేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ కూడా రానుంద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నించాలి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. దీంతో టీడీపీ నాయ‌కుల‌కు ఛా న్స్ ఇచ్చిన‌ట్టు అయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ ఎంపీల‌ను, సీఎం జ‌గ‌న్‌ను కూడా టీడీపీ నాయ‌కులు ఏకేస్తున్నారు. ఇంత మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. ఎంపీల రాజీనామాకు కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక‌, వైసీపీ వైపు నుంచి చూస్తే.. అధినేత జ‌గ‌న్ ఆదేశాలు లేకుండా మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌బోమ‌ని.. సాక్షాత్తూ ఎంపీలే అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామాల‌తో అప్ప‌ట్లో టీడీపీ .. వైసీపీకి చిక్కితే.. ఇప్పుడు అదే పార్టీ టీడీపీకి చిక్కింద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డంగ‌మ‌నార్హం.  


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>