PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఇక మంగళగిరిలో నారా లోకేష్ సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నేతలు, పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఎక్కడికిక్కడ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కమ్మ నేతలు, పంచాయితీ పోరులో గెలవడానికి పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఏకగ్రీవాలకు చెక్ పెట్టి అధికార వైసీపీకి ధీటుగా తమ అభ్యర్ధుల చేత నామినేషన్స్ వేయించారు. అలాగే ఎన్నికల్లో ఎలాగైనా తమ అభ్యర్ధులని గెలిపించే దిశగా పనిచేస్తున్నారు. తమ సీనియారిటీని ఉపయోగించి వైసీపీjagan ysrcp;view;lokesh;raja;sridhar;kamma;jagan;kodela siva prasada rao;nara lokesh;amaravati;andhra pradesh;2019;government;assembly;cheque;letter;tdp;ycp;lokesh kanagaraj;ponnur;prathipati pullarao;pedakurapadu;narendraఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?jagan ysrcp;view;lokesh;raja;sridhar;kamma;jagan;kodela siva prasada rao;nara lokesh;amaravati;andhra pradesh;2019;government;assembly;cheque;letter;tdp;ycp;lokesh kanagaraj;ponnur;prathipati pullarao;pedakurapadu;narendraSat, 06 Feb 2021 08:13:00 GMTఏపీ రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ కమ్మ నాయకులే రాజకీయాలని నడిపిస్తుంటారు. ముఖ్యంగా టీడీపీలో ఈ కమ్మ నేతల ప్రభావం ఎక్కువగా ఉంది. 2014లో అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు కమ్మ నేతల హవా బాగానే నడిచింది. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయాక కమ్మ నేతలు సైలెంట్ అయ్యారు. అయితే గత కొన్ని నెలల నుంచి గుంటూరు కమ్మ టీడీపీ నేతలు బయటకొచ్చి, జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. మళ్ళీ టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

తెనాలిలో ఆలపాటి రాజా, వినుకొండలో జి‌వి ఆంజనేయులు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావులు గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే వీరిలో శివరాం తప్పా మిగతా నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఓడిపోయారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నేతలు, పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఎక్కడికిక్కడ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కమ్మ నేతలు, పంచాయితీ పోరులో గెలవడానికి పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఏకగ్రీవాలకు చెక్ పెట్టి అధికార వైసీపీకి ధీటుగా తమ అభ్యర్ధుల చేత నామినేషన్స్ వేయించారు. అలాగే ఎన్నికల్లో ఎలాగైనా తమ అభ్యర్ధులని గెలిపించే దిశగా పనిచేస్తున్నారు. తమ సీనియారిటీని ఉపయోగించి వైసీపీని చిత్తు చేయాలని చూస్తున్నారు.

అయితే అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదనే చెప్పొచ్చు. పైగా సంక్షేమ పథకాలు వైసీపీకి ప్లస్ అవుతాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు మరింత కష్టపడాల్సిన అవసరముంది. అలాగే ఇలాంటి సమయంలో అమరావతి అంశాన్ని ప్రచారంలోకి తీసుకొస్తే కమ్మ నేతలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి టీడీపీ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేయగలరో లేదో.




టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

రచ్చకెక్కిన క్రాక్ వివాదం...నిర్మాత మీద గోపీచంద్ ఫిర్యాదు !

జగడ్డ: అధికారుల్ని బెదిరించడంలో నిమ్మగడ్డను మించిపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>